వేములవాడ పోలీస్ స్టేషన్లో విధులు నిర్వహిస్తున్న తొమ్మిది మంది పోలీస్ సిబ్బందిని రాజన్న సిరిసిల్ల జిల్లా ఎస్పీ అఖిల్ మహజాన్ జిల్లా పోలీస్ కార్యాలయానికి అటాచ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. వేములవాడ పోలీస్ స్టేషన్లో విధులు నిర్వహిస్తున్న ఐదుగురు కానిస్టేబుల్ నలుగురు హోంగార్లు విధుల పట్ల నిర్లక్ష్యం చేసినందునే అటాచ్ చేయడం జరిగిందని జిల్లా ఎస్పీ పేర్కొన్నారు. విదుల పట్ల ఎంతటి వారైనా సరే నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే శాఖపరమైన చర్యలు తప్పవని జిల్లా ఎస్పీ అన్నారు.
