ప్రాంతీయం

నిబంధనల మేరకు పార్లమెంట్ ఎన్నికల నిర్వహణ

83 Views

 

-నిబంధనల మేరకు పార్లమెంట్ ఎన్నికల నిర్వహణ::జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి

-ప్రతి నోడల్ అధికారి వారికి కేటాయించిన విధులను పకడ్బందీగా నిర్వహించాలి

-ప్రతి ఓటరు తమ ఓటు హక్కును వినియోగించుకునేలా వినూత్నంగా స్వీప్ కార్యక్రమాల నిర్వహణ

-ఎన్నికల ప్రవర్తనా నియమావళి పక్కాగా అమలు

-అభ్యర్థుల ఎన్నికల ప్రచార ఖర్చు వివరాలను కట్టుదిట్టంగా నమోదు చేయాలి

-18 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరికి ఓటు హక్కు కల్పిస్తూ ఓటరు జాబితా రూపకల్పన

-పార్లమెంట్ ఎన్నికల నిర్వహణ పై నోడల్ అధికారులతో అవగాహన కార్యక్రమం నిర్వహించిన జిల్లా కలెక్టర్

రాజన్న సిరిసిల్ల, మార్చి -16:

రాబోయే పార్లమెంట్ ఎన్నికలను భారత ఎన్నికల కమీషన్ నిబంధనల ప్రకారం సజావుగా నిర్వహించాలని జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి అన్నారు.

శనివారం జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి సమీకృత జిల్లా కలెక్టరేట్ లోని సమావేశ మందిరంలో రాబోయే పార్లమెంట్ ఎన్నికల నిర్వహణ పై నోడల్ అధికారులతో రివ్యూ నిర్వహించారు.

ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి మాట్లాడుతూ, ప్రతి ఎన్నికను ఒక కొత్త ఎన్నికగా మాత్రమే మనం పరిగణించాలని, ఎన్నికల కమీషన్ మనకు కేటాయించిన విధులను ఎటువంటి అలసత్వం వహించకుండా సంపూర్ణంగా పూర్తి చేయాలని, ఎన్నికల సందర్భంగా ఏ చిన్న పొరపాటు జరిగిన పరిణామాలు తీవ్రంగా ఉంటాయని కలెక్టర్ తెలిపారు.

ఎన్నికల విధులను సకాలంలో పూర్తి చేయాలని కలెక్టర్ అధికారులకు సూచించారు. ప్రతి అధికారి తనకు కేటాయించిన విధుల పట్ల అవగాహన పెంచుకొని వాటిని సమర్థవంతంగా నిర్దేశిత సమయంలో పూర్తి చేస్తే ఎన్నికల సజావుగా జరుగుతాయని కలెక్టర్ అన్నారు.

ఎన్నికల నిర్వహణకు అవసరమైన మేర ప్రిసీడింగ్ అధికారులు అసిస్టెంట్ ప్రొసీడింగ్ అధికారులు పోలీసు అధికారులు, ఇతర సిబ్బంది వివరాలను జిల్లా విద్యాశాఖ అధికారి ఆధ్వర్యంలో ఆన్ లైన్ లో నమోదు చేయాలని, ఎన్నికల షెడ్యూల్ ప్రకటించిన తర్వాత మొదటి దశ సిబ్బంది ర్యాండమైజేషన్ ప్రక్రియ జరుగుతుందని కలెక్టర్ తెలిపారు.

ఎన్నికల నిర్వహణలో పాల్గొనే ప్రతి సిబ్బందికి అవసరమైన శిక్షణ అందించాలని, ఎన్నికలలో వారి బాధ్యతలు విధి నిర్వహణ చేపట్టాల్సిన తీరు, ఎన్నికల కమిషన్ నిబంధనలపై సంపూర్ణ అవగాహన కల్పించేలా శిక్షణ కార్యక్రమాలను ఏర్పాటు చేయాలని కలెక్టర్ సూచించారు. ఎన్నికల నిర్వహణకు అవసరమైన సామాగ్రి, స్ట్రాంగ్ రూమ్ ఇతర ఏర్పాట్లు పక్కాగా ఉండాలని అన్నారు.

ఎన్నికల సందర్భంలో ఫ్లైయింగ్ స్క్వాడ్ బృందాలు, సెక్టార్ అధికారులు, అకౌంటింగ్ బృందాలు, వీడియో సర్వేలెన్స్ బృందాలు, ఈవిఎం యంత్రాలు, పోస్టల్ బ్యాలెట్ తరలింపు కోసం అవసరమైన మేర వాహనాలను సన్నద్దం చేయాలని, ప్రతి వాహనాన్ని తప్పనిసరిగా జిపిఎస్ ట్రాకర్ అందుబాటులో ఉండాలని కలెక్టర్ ఆదేశించారు.

సివిజల్ , టోల్ ఫ్రీ నెంబర్, ఆన్ లైన్ ద్వారా ఫిర్యాదుల స్వీకరణ, వివిధ రాజకీయ పార్టీల, అభ్యర్థులు, సభలు ,ర్యాలీల నిర్వహణకు అనుమతి దరఖాస్తుల కోసం కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేయాలని కలెక్టర్ సూచించారు. రాబోయే పార్లమెంట్ ఎన్నికలలో ప్రతి ఓటరు తన ఓటు హక్కు వినియోగించుకునేలా వినూత్నంగా స్వీప్ కార్యక్రమాల నిర్వహించాలని కలెక్టర్ తెలిపారు.

ఎన్నికల షెడ్యూల్ విడుదలైన వెంటనే ఎన్నికల ప్రవర్తన నియమావళిని జిల్లాలో పక్కాగా అమలు చేయాలని, 24 గంటల వ్యవధిలో ప్రతి ప్రభుత్వ భవనాలలో వివిధ రాజకీయ పార్టీలకు, నాయకులకు సంబంధించిన హోర్డింగులు, నాయకుల ఫోటోలు , వాల్ రైటింగ్స్ తొలగించాలని, 48 గంటల వ్యవధిలో పబ్లిక్ ప్రాపర్టీస్ వద్ద హోర్డింగులు, ఫ్లెక్సీలు ఫోటోలు తొలగించాలని, ప్రైవేట్ స్థలాలో ఉన్న హోర్డింగులు, ఫ్లెక్సీలు, ఫోటోలను 72 గంటల్లో తొలగించాలని ఆయన అధికారులకు ఆదేశించారు.

ఎన్నికల సందర్భంగా వివిధ రాజకీయ పార్టీలు అభ్యర్థుల ప్రచార వివరాలను అకౌంటింగ్ బృందాలు పక్కాగా నమోదు చేయాలని కలెక్టర్ సూచించారు. ఎన్నికల విధులు నిర్వహించే ప్రభుత్వ సిబ్బంది, 85 సంవత్సరాలు పైబడిన దరఖాస్తు చేసుకున్న ఓటర్లకు, దరఖాస్తు చేసుకున్న దివ్యాంగ ఓటర్లకు పోస్టల్ బ్యాలెట్, ఈటిబిపిఎస్ సౌకర్యం కల్పించాలని అన్నారు.

ఎన్నికల సందర్భంగా వివిధ దశలలో జరుగుతున్న అంశాలను ప్రజలకు వివరించేందుకు పత్రిక సమావేశాలు ఏర్పాటు చేయాలని, దినపత్రికలలో ఎలక్ట్రానిక్ మీడియాలో వచ్చే పేయిడ్ వార్తలను గుర్తించి రోజు నివేదిక సమర్పించాలని కలెక్టర్ జిల్లా పౌర సంబంధాల అధికారి ని ఆదేశించారు. 18 సంవత్సరాలు నిండిన అర్హులందరికీ ఓటర్ జాబితాలో పేరు నమోదు అయ్యేవిధంగా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ సిరిసిల్ల రెవెన్యూ డివిజన్ అధికారిని ఆదేశించారు.

ఎన్నికల ప్రవర్తన నియమావళి ఉల్లంలపై సి విజిల్ టోల్ ఫ్రీ నెంబర్ ఆన్లైన్ ద్వారా వచ్చే ఫిర్యాదులను ఎప్పటికప్పుడు పరిష్కరించాలని, అధికారుల సమన్వయంతో పనిచేసి సజావుగా పార్లమెంట్ ఎన్నికలు జరిగేలా చూడాలని కలెక్టర్ పేర్కొన్నారు.

అంతరం సమీకృత జిల్లా కలెక్టరేట్ లో ఏర్పాటు చేసిన కంట్రోల్ రూం, సీ.విజిల్, ఎం.సి.ఎం.సి. , మీడియా సెంటర్ లతో కూడిన కంప్లీట్ ఎన్ కోర్ ఐటీ సెల్ ను పరిశీలించారు

ఈ సమావేశంలో అదనపు కలెక్టర్ ఖీమ్యా నాయక్, అదనపు కలెక్టర్ పి. గౌతమి , సిరిసిల్ల రెవెన్యూ డివిజన్ అధికారీ, ఎల్.రమేష్, ఎలక్షన్ నోడల్ అధికారులు, తదితరులు పాల్గొన్నారు.

Oplus_131072
Oplus_131072
Telugu News 24/7