ములుగు జిల్లా,మంగపేట, సెప్టెంబర్ 19
మంగపేట మండలంలోని నరసింహసాగర్ మల్లూరు తిమ్మంపేట తెలంగాణ సాంస్కృతిక సారధి రాగుల శంకర్ బృందం చేత ఓటర్ నమోదుపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు.
18 సంవత్సరాల నుండిన యువతీ యువకులు ఓటురు నమోదు చేసుకోవాలని భారత రాజ్యాంగం కల్పించిన ఓటు హక్కును అందరు సద్విని యోగం చేసుకోవాలని కళాకా రులు అవగాహన కల్పించారు.
సీజనల్ వ్యాధుల పట్ల ప్రజల అప్రమత్తంగా ఉండాలని ఆట పాటలతో ప్రజలకు అర్థమ య్యే రీతిలో తెలియజేయడం జరిగింది.ఈ కార్యక్రమంలో విలేజ్ స్పెషల్ ఆఫీసర్లు పి రూప్ సింగ్, టీ దివ్య, కళాకారులు మార్త రవి, గోల్కొండ బుచ్చన్న ఈర్ల సాగర్, కనకం రాజేందర్, రేలా విజయ్, అమ్మపాట తిరుపతి, రేలా కుమార్, ఉండ్రతి భాస్కర్, గోల్కొండ నరేష్, గౌరారపు రాజు,కామెర దీపక్, మొగిలిచర్ల రాము,శోభ,శ్రీలత లు పాల్గొన్నారు.