మార్చ్ 16,24/7 తెలుగు న్యూస్ :భారత జాగృతి అధ్యక్షురాలు, బిఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత అక్రమ అరెస్టును నిరసిస్తూ.. కేంద్రంలోని బిజెపి ప్రభుత్వ పక్షపాత వైఖరిని ఖండిస్తూ.
బిఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు శ్రీ కల్వకుంట్ల చంద్రశేఖర రావు పిలుపుమేరకు.. నారాయణఖేడ్ మాజీ ఎమ్మెల్యే మహా రెడ్డి భూపాల్ రెడ్డి ఆధ్వర్యంలో,
బిఆర్ఎస్ పార్టీ నారాయణఖేడ్ నియోజకవర్గ కేంద్రం లో ర్యాలీ నిర్వహించి నిరసన తెలిపిన నారాయణఖేడ్ నియోజకవర్గ బీఆర్ఎస్ పార్టీ నాయకులు.
ఐటి, ఈడి, సిబిఐ లాంటి కేంద్ర ప్రభుత్వ సంస్థలను ప్రతిపక్ష పార్టీలను అణచివేసేందుకు కేంద్రంలోని మోడీ ప్రభుత్వం ప్రయత్నం చేస్తోందని బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు విమర్శించారు.
అక్రమ కేసులను ఎత్తివేసేంతవరకు బిఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో ప్రజాక్షేత్రంలో పోరాటం కొనసాగిస్తామని మాజీ ఎమ్మెల్యే మహా రెడ్డి భూపాల్ రెడ్డి మరియు బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు తెలిపారు.
ఈ కార్యక్రమంలో నియోజకవర్గ ప్రజాప్రతినిధులు జడ్పిటిసిలు, ఎంపీపీలు, మండల పార్టీ అధ్యక్షుడు, మండల పార్టీ యువత అధ్యక్షుడు, సోషల్ మీడియా అధ్యక్షులు, మున్సిపల్ కౌన్సిలర్లు, గ్రామ పార్టీ అధ్యక్షులు, పార్టీ ముఖ్య నాయకులు కార్యకర్తలు ప్రజలు భారీ సంఖ్యలో పాల్గొన్నారు.