రాజకీయం

కవిత అరెస్టును నిరసిస్తూ నల్ల బ్యాడ్జీలతో నిరసన…

135 Views

(మానకొండూర్ మర్చి 16)

ఎమ్మెల్సీ కవితను కక్షపూరితంగా అరెస్టు చేయడం సిగ్గుచేటని మానకొండూరు మాజీ ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ మండిపడ్డారు..

రాజకీయ లబ్ధి కోసం బిజెపి, కాంగ్రెస్ పార్టీ లు ఆడుతున్న ఒక డ్రామా అని విమర్శించారు..

కరీంనగర్ జిల్లా మానకొండూర్ మండల కేంద్రంలో బిఆర్ఎస్ పార్టి ఆధ్వర్యంలో కవిత అరెస్టుకు నిరసనగా నల్లబ్యాడ్జిలతో ధర్నా చేపట్టారు..

ఈ ధర్నాలో మాజీ ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ పాల్గొని మాట్లాడుతూ…

రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో బిఆర్ఎస్ పార్టీపై బిజెపి కాంగ్రెస్ పార్టీ లు బురదజల్లే ప్రయత్నం చేయడం జరుగుతుందన్నారు.

కావాలనే కక్షపూరితంగా ఎమ్మెల్సీ కవితను అరెస్టు చేసి పార్లమెంట్ ఎన్నికల్లో ఓట్లు దండుకోవడానికి ప్రయత్నాలు చేస్తున్నారని ఆరోపించారు..

రాజకీయ లబ్ధి కోసం కేసులు పెట్టడాన్ని వ్యతిరేకిస్తున్నామని తెలిపారు.
వెంటనే ఎమ్మెల్సీ కవితను విడుదల చేయాలని డిమాండ్ చేశారు..

ఈ కార్యక్రమంలో బిఆర్ఎస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు…

Oplus_131072
Oplus_131072
కొమ్మెర రాజు తిమ్మాపూర్