రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు శనివారం రాత్రి హైదరాబాద్ లో ఐటీ శాఖ మంత్రి దుద్దిర్ల శ్రీధర్ బాబుకు ఎల్లారెడ్డిపేట సమస్యల గురించి వివరించారు ఈ సందర్భంగా హైదరాబాదులోని రవీంద్రభారతిలో దుద్దిళ్ళ శ్రీపాదరావు 87వ వేడుకలు జయంతి ఉత్సవాలు రవీంద్రభారతిలో జరగగా వాటికీ హాజరై పలు సమస్యల గురించి వివరించినట్లు బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు దొమ్మాటి నర్సయ్య ఆదివారం స్థానిక విలేకరులకు తెలిపారు ఈ ప్రాంతానికి సంబంధించిన ఉన్నత విద్యను అభ్యసించిన ఎందరో యువకులు ఉన్నారని వారికి ఐటి కంపెనీలలో ఉద్యోగ అవకాశాలు కల్పించాలని విన్నవించినట్లు తెలిపారు కలిసిన వారిలో మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు సద్ది లక్ష్మారెడ్డి జిల్లా కాంగ్రెస్ ఉపాధ్యక్షులు షేక్ గౌస్ జిల్లా కార్యదర్శి కొండాపురం శ్రీనివాస్ రెడ్డి బుగ్గ కృష్ణమూర్తి కలిశారు





