సిద్దిపేట జిల్లా నవంబర్ 23
24/7 తెలుగు న్యూస్ ప్రతినిధి
గజ్వెల్ నియోజకవర్గంలోని కుకునూర్పల్లి మండలం లకుడారం గ్రామంలో బీఆర్ఎస్ పార్టీ ప్రచారంలో భాగంగా సర్పంచ్ కందూరి కనకవ్వ ఐలయ్య ఆధ్వర్యంలో ప్రచారం చేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా ఎఫ్ డీ సి చైర్మన్ వంటేరు ప్రతాప్ రెడ్డి, కుకునూర్పల్లి మండల ఇంచార్జి లక్కీరెడ్డి ప్రభాకర్ రెడ్డి పాల్గొని కెసిఆర్ యొక్క నాయకత్వంలో సంక్షేమ పథకాలు మరియు చేసినటువంటి అభివృద్ధిని తెలుపుతూ ప్రజలకు వివరించడం జరిగింది.దీనికి లకుడారం గ్రామ ప్రజలు మరియు కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొని విజయవంతం చేయడం జరిగింది.ఈ కార్యక్రమంలో ప్రదీప్ యాదవ్, పత్తిరి రాము మరియు కంకణాల మల్లేశం రజక సంఘం మండల అధ్యక్షులు, రాచకొండ మైపాల్,మహేష్ యాదవ్ తదితరులు పాల్గొన్నారు.
