తెలుగు 24/7న్యూస్ (తొర్రూరు ప్రతినిధి) మార్చి 15
వాసవి క్లబ్ ఆధ్వర్యంలో సేవా కార్యక్రమాలు చేపట్టడం అభినందనీయమని కస్తూరిబా గాంధీ పాఠశాల ప్రిన్సిపాల్ ఎస్ శైలజ అన్నారు.శుక్రవారం వాసవి క్లబ్స్ ఆధ్వర్యంలో క్లబ్ సభ్యులు వేమిశెట్టి జగదీష్,లత వివాహ వార్షికోత్సవం సందర్భంగా పాఠశాలలో చదువుతున్న పదవ తరగతి విద్యార్థులకు పరీక్ష ప్యాడ్స్ .పెన్నులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలలో చదివే పెద్ద విద్యార్థులను ఆదుకోవడం అభినందనీయం అన్నారు. పాఠశాలలో అతిథులు వచ్చినప్పుడు కుర్చీల కొరత ఉందని. ప్రిన్సిపల్ తెలపగా తప్పకుండా కుర్చీలు అందిస్తామని అన్నారు. దీంతోపాటు పెద్ద ముప్పారం గ్రామంలో నిర్వహిస్తున్న అనాధాశ్రమం కు 25 కేజీల బియ్యం నిర్వాహకులకు అందజేశారు.ఈ కార్యక్రమంలో వాసవి వనిత క్లబ్ అధ్యక్షురాలు దారం.గాయత్రి,వాసవి క్లబ్ తొర్రూర్ కార్యదర్శి చౌడవరపు రాము,వాసవి చత్రపతి శివాజీ యూత్ క్లబ్ సెక్రటరీ నిఖిల్,కోశాధికారి అఖిల్ సభ్యులు మధు పాఠశాల ఉపాధ్యాయులు విద్యార్థిని,విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.
