ప్రాంతీయం

ప్రజల నుండి అర్జీలు స్వీకరించిన అదనపు కలెక్టర్లు

90 Views

 

సిరిసిల్ల, మార్చి 11, 2024:

జిల్లా సమీకృత కార్యాలయాల సముదాయంలోని ఆడిటోరియంలో సోమవారం ప్రజావాణి నిర్వహించగా, అదనపు కలెక్టర్లు ఖీమ్యా నాయక్, పూజారి గౌతమి అర్జీలు స్వీకరించారు. ప్రజావాణిలో  వచ్చే దరకాస్తులు ఆయా శాఖల అధికారులు పరిశీలించి, వేగంగా పరిష్కారం చూపాలని అధికారులను ఆదేశించారు.

రెవెన్యూ శాఖకు 23, సిరిసిల్ల మున్సిపల్ కార్యాలయానికి 14, జిల్లా పంచాయతీ కార్యాలయానికి 3, స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ కార్యాలయానికి 3, చందుర్తి, కోనరావుపేట, తంగళ్లపల్లి ఎంపీడీవో కార్యాలయాలు, టౌన్ ప్లానింగ్, ఉపాధి కల్పన, సర్వే, డీఆర్డీఓ కార్యాలయాలకు ఒకటి చొప్పున మొత్తం 50 దరఖాస్తులు వచ్చాయి.

*హెల్ప్ డెస్క్ ఏర్పాటు*

*వృద్దులు, దివ్యాంగులు, ట్రాన్స్ జెండర్లకు సేవలు*

కలెక్టర్ అనురాగ్ జయంతి ఆదేశాల మేరకు జిల్లా సంక్షేమ శాఖ ఆధ్వర్యoలో జిల్లా సమీకృత కార్యాలయాల సముదాయంలోని ప్రధాన ద్వారం వద్ద హెల్ప్ డెస్క్ ను ఏర్పాటు చేశారు. వృద్దులు, దివ్యాంగులు, ట్రాన్స్ జెండర్లకు సాయం చేసేందుకు జిల్లా సంక్షేమ శాఖ సిబ్బంది అందుబాటులో ఉండి సేవలు అందించారు. ప్రజావాణికి వచ్చే వృద్దులు, దివ్యాంగులను వీల్ చైర్ లో కూర్చోబెట్టి దరఖాస్తుకు చేసుకునేందుకు తోడ్పాటు అందిస్తున్నారు. అలాగే నడవలేని వారికి నడవలేని వారికి మాన్యువల్ ట్రై సైకిల్స్, చెవిటి వారికి వినికిడి యంత్రాలు అందుబాటులో ఉన్నాయి.

ఈ కార్యక్రమంలో సిరిసిల్ల, వేములవాడ ఆర్డీఓలు రమేష్, రాజేశ్వర్, జెడ్పీ సీఈఓ ఉమారాణి, డీఆర్డీఓ శేషాద్రి, జిల్లా అధికారులు, తదితరులు పాల్గొన్నారు.

Oplus_131072
Oplus_131072
Telugu News 24/7