ప్రాంతీయం

నిబంధనల ప్రకారం నెంబర్ ప్లేట్ లేని వాహనాలపై స్పెషల్ డ్రైవ్

149 Views

నిబంధనల ప్రకారం నెంబర్ ప్లేట్ లేని వాహనాలపై స్పెషల్ డ్రైవ్

 

తంగళ్ళపల్లి మండల కేంద్రంలో ఎస్పీ రాహుల్ హెడ్గే ఆదేశాల మేరకు మండల కేంద్రంలో గురువారం రూరల్ సీఐ ఉపేందర్ ఎస్సై లక్ష్మారెడ్డి నెంబర్ ప్లేట్ సరిగా లేని వాహనాలు తనిఖీలు నిర్వహించారు. ప్రధాన కూడళ్ళతోపాటు, శివారులో వాహనాల తనిఖీలు నిర్వహించి ధ్రువీకరణ పత్రాలు లేని వాహనాల, డ్రైవింగ్ లైసెన్స్ లేని వారిపై , ఇన్సూరెన్స్ లేని వారిపై, నెంబర్ ప్లేట్ నిబంధనల ప్రకారం లేని, వాహనాలపై కేసులు నమోదు చేశారు. రోడ్డు భద్రత నియమాలు, ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘించిన వారిపై కేసులు నమోదు చేయడంతో పాటు జరిమానాలు విధిస్తున్నామన్నారు. వాహనదారులు తప్పనిసరిగా వాహన ధ్రువీకరణ పత్రాలు , లైసెన్సులు, ఇన్సూరెన్స్ పత్రాలు కలిగి ఉండాలన్నారు. ర్యాష్ డ్రైవింగ్ చేసే వారిపై, డ్రైవింగ్ లైసెన్స్ లేని వారికి లేని వారికి బండి ఇవ్వడం, మైనర్ పిల్లలకు వాహనాలు ఇవ్వడం, నెంబర్ ప్లేట్ లేకుండా వాహనాలు నడపడం, మద్యం సేవించి వాహనాలు నడపడం, ఇట్టి వాహనాల పై కేసులు నమోదు చేసి కేసు నమోదు చేయడం జరుగుతుందని అదేవిధంగా న్యూ ఇయర్ సందర్భంగా స్పెషల్ డ్రైవర్ అనేది కొనసాగిస్తామన్నారు.

IMG-20251226-WA0281
IMG-20251226-WA0281

Poll not found
Telugu News 24/7