బీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేసిన మాజీ సర్పంచ్ నేవూరి వెంకట్ రెడ్డి తన సభ్యత్వానికి రాజీనామా చేసి రాజన్న సిరిసిల్ల జిల్లా అధ్యక్షులు తోట ఆగయ్యకు రాజీనామా పత్రాన్ని సోమవారం రోజున అందించినట్లుగా విలేకరుల ప్రకటనలో తెలిపారుగ త 10 సంవత్సరాలుగా బీఆర్ఎస్ పార్టీలో ఉండి కీలక పాత్ర పోషించారురాజీనామా పత్రాన్ని జిల్లా అధ్యక్షులు తోట ఆగయ్యకు ఫ్యాక్స్ ద్వారా పంపినట్లుగా ప్రాథమిక సమాచారం. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ గత 10 సంవత్సరాలుగా పార్టీలో క్రియాశీలకంగా కొనసాగుతూ అంకిత భావంతో పనిచేసిన తనకు గుర్తింపు లేదని స్పష్టం చేశారు. నియోజకవర్గ ఎమ్మెల్యే కేటీఆర్ పై విశ్వాసంతో , నమ్మకంతో ఇన్ని సంవత్సరాలు బీఆర్ఎస్ పార్టీలో పని చేశానని తనకు ఎలాంటి గౌరవం దక్కలేదని ఆశించిన స్థాయిలో అభివృద్ధి జరగలేదని పేర్కొన్నారు. అదేవిధంగా తనకు వ్యక్తిగతంగా చెల్లి గవ్వ కూడా ఇవ్వలేదని అన్నారు. తన మండల ప్రజలతో చర్చించి ఏ పార్టీలోకి వెళ్లేదని తెలుపుతానని చెప్పారు ఎల్లారెడ్డిపేట మండల కేంద్రానికి చెందిన మాజీ సర్పంచ్ నెవూరి వెంకట్ రెడ్డి త్వరలో కాంగ్రెస్ పార్టీలో చేరనున్నట్లు ఆయన అనుచరులు చెబుతున్నారు. ఎల్లారెడ్డిపేట ఉమ్మడి మండలానికి చెందిన పలువురి ప్రజా ప్రతినిధులతో కలిసి మంత్రి ఆధ్వర్యంలో చేరనున్నట్లు విశ్వసనీయంగా తెలుస్తోంది.






