ముస్తాబాద్, మార్చి 10 (24/7న్యూస్ ప్రతినిధి): సావిత్రిబాయి పూలే చిత్రపటానికి పూలమాలవేసి నివాళులు అర్పించిన విద్యార్థి విభాగం. భారత రాష్ట సమితి విద్యార్థి విభాగం రాష్ట్ర నాయకులు కంచర్ల రవిగౌడ్ మాట్లాడుతూ భారతదేశపు తొలిమహిళా ఉపాద్యాయురాలు మహిళ విముక్తి ఉద్యమానికి మార్గదర్శకురాలు సత్య శోధనకు, సత్యసాదనకు ప్రతీక శ్రీమతి సావిత్రి భాయి ఫూలేగారు బాల్య వివాహాo చేసుకున్న స్త్రీ, భర్త మహాత్మ ఫూలే గారి ప్రోత్సాహంతో స్వంతంగా చదువుకున్న, బహుజన పేద మహిళల కోసం పాఠశాలలు స్థాపించి, మహిళా సేవా మండల్ నెలకొల్పి, నిరుపేద మహిళలకు ధైర్యాన్ని నూరిపోసి, జ్ఞానాన్ని అందించి వారి జీవితాల్లో వెలుగులు నింపి ఎన్నో అవమానాలు, ఆటంకాలు ఎదురైనా నిరుత్సాహ పడని స్తిరచిత్తురాలు. ఆమె జీవితం ఆదర్శవంతం, సేవ జాతికి స్ఫూర్తివంతం అని అన్నారు. ఈకార్యక్రమంలో జిల్లా నాయకులు మట్టే శ్రీనివాస్, నాయకులు నవీన్, రవి, రాకేష్, స్వామి, జగన్, వంశీ, పవన్ గణేష్, నరేష్, తిరుపతి, విద్యార్థులు పాల్గొన్నారు.
