అక్రమ కట్టడాలు. డ్రగ్స్. గంజాయి నాణ్యత పరిమాణాలు పాటించని హోటల్స్ పై సీఎం రేవంత్ రెడ్డి ఉక్కు పాదం ప్రకటిస్తున్న తీరుపై తెలంగాణ ప్రజలు సర్వత్ర ప్రశంసాలు కురిపిస్తున్నారని మెదక్ జిల్లా కాంగ్రెస్ నాయకులు బుడ్డ భాగ్యరాజ్ తెలిపారు. హైడ్రా ఉక్కు పాదం మోపి అక్రమ కట్టడాలను కూల్చివేయడం శుభ సూచకమన్నారు. డ్రగ్స్, గంజాయి, పరిశుభ్రత పాటించాలని బడా హోటల్స్ పై చర్యలు తీసుకోవడం పట్ల ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రభుత్వంపై ప్రజల్లో విశ్వనీయత మరింత రెట్టింపు అయిందని తెలిపారు. అక్రమ కట్టడాలు. డ్రగ్స్. గంజాయి. బడా హోటల్స్ పై చర్యలకు సైతం వెనుకాడడానికి సీఎం రేవంత్ రెడ్డికి తెలంగాణ ప్రజలు అండగా నిలవాలని బుడ్డ భాగ్యరాజ్ విజ్ఞప్తి చేశారు.
