ముస్తాబాద్, మార్చి5 (24/7న్యూస్ ప్రతినిధి): మండల కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన ఆరు గ్యారంటీ పథకాలలో భాగంగా గృహజ్యోతి పథకం కింద 200 యూనిట్ల ఉచిత విద్యుత్ బిల్లును ప్రారంభించారు. ప్రతిఇంటికి 200 యూనిట్ల విద్యుత్ బిల్లును అందే విధంగా చర్యలు తీసుకోవాలని అధికారులు ప్రజలకు ఇబ్బందులు కలగకుండా ఇంకా ఎవరైనా ఉచిత విద్యుత్ బిల్లుకు అర్హులు కానివారు ఎవరైనా ఉంటే ఎంపీడీవో ఆఫీస్ కు వెళ్లి మళ్లీ అప్లై చేసుకోవాలని ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నామని తెలిపారు. ఈకార్యక్రమంలో జడ్పిటిసి గుండం నరసయ్య, సెస్ డైరెక్టర్ అంజిరెడ్డి, సెస్ ఏడి మహేందర్, కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు ఏళ్ల బాల్ రెడ్డి, ఏఈ విష్ణుతేజ, ఎంపిటిసి గుండెల్లి శ్రీనివాస్, గజ్జలరాజు, ఉచ్చిడి బాల్ రెడ్డి, రామ్ రెడ్డి, బద్దిపడగ ప్రతాపరెడ్డి, మాదాసు అనిల్, ఎల్సాని దేవయ్య తదితరులు పాల్గొన్నారు.
