ప్రాంతీయం

చాకలి ఐలమ్మ విగ్రహావిష్కరణ స్థానిక…

280 Views
 ముస్తాబాద్, మార్చి 5 (24/7న్యూస్ ప్రతినిధి): నిజాం నిరంకుశ పాలనకు వ్యతిరేకంగా పోరాడి వెనుకబడిన తరగతుల్లో సామాజిక చైతన్యం రగిలించిన వీరవనిత చిట్యాల చాకలి ఐలమ్మ విగ్రహాన్ని బిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, రాజన్న సిరిసిల్ల స్థానిక ఎమ్మేల్యే కేసీఆర్ చేతుల మీదుగా మంగళవారం తంగళ్ళపల్లి మండల కేంద్రంలో నూతనంగా ఆవిష్కరించారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ చాకలి ఐలమ్మ పోరాట పటిమను యావత్‌ తెలంగాణ ప్రజలు ఎప్పటికీ మరువలేరన్నారు. ఐలమ్మ పోరాటం ఫలితంగానే తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటం నిజాం నిరంకుశ పాలనను దహించివేసిందన్నారు. నాలుగు వేల మంది అమరుల త్యాగాలతో తెలంగాణ చరిత్ర తిరగరాసిందని, లక్షల ఎకరాల భూపంపిణీకి ఆమె పోరాటమే నాంది పలికిందన్నారు. ఐలమ్మ ఆశయసాధనకు కృషి చేయాల్సిన అవసరం ఎంతగానో ఉందన్నారు. ఈ కార్యక్రమంలో టిఆర్ఎస్ నాయకులు, రజకులు, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.
Oplus_131072
Oplus_131072
కస్తూరి వెంకట్ రెడ్డి ఆంధ్రప్రభ ముస్తాబాద్