ప్రాంతీయం

కారుగుర్తుకే మనఓటు. సురువు చేసిన గులాబీలు…

267 Views
   ముస్తాబాద్, అక్టోబర్10, తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికల నిర్వహణకు సీఈసీ షెడ్యూల్ విడుదల చేసిన విషయం తెలిసిందే. రాష్ట్రంలో ఒకే విడతలో నవంబర్ 30న పోలింగ్ జరగనుంది. ఎన్నికల నగారా మోగడంతో అన్ని పార్టీలు ఎన్నికల రణరంగంలోకి దూకేందుకు సిద్ధమయ్యాయి. అధికార బీఆర్ఎస్ పార్టీ ఇప్పటికే ఎన్నికల రణరంగంలోకి దిగింది. ఆ పార్టీ అధినేత, సీఎం కేసీఆర్ నియోజకవర్గాల వారిగా అభ్యర్థులనుసైతం ఇప్పటికే ప్రకటించారు. తాజాగా ఎన్నికల షెడ్యూల్ వెలువడటంతో మరింత దూకుడు పెంచేందుకు సిద్ధమయ్యారు. ఈనెల15నుంచి మొదలుపెట్టి ఎన్నికల ప్రచార పర్వం పూర్తయ్యే వరకు కేసీఆర్ ప్రజల్లో ఉండనున్నారని మండల రైతు బంధు అధ్యక్షులు కల్వకుంట్ల గోపాలరావు తెలిపారు. ఇదిఇలా ఉండగా నేడు వరుసగా సభలతో పాటు, పలు గ్రామాల్లో కులసంఘాల సభల్లో ముస్తాబాద్ మండలంలో కెజిఆర్ పాల్గొనడం సురువు చేశారు. నేడు ఉదయం నుండే నామపూర్ గ్రామంలో శ్రీకృష్ణ యాదవ సంఘముతో మీటింగ్ ఏర్పాటుచేసి ఎన్నికల ప్రచారంలో పాల్గొని కారుగుర్తుకే మనఓటు నిర్వహించే కార్యక్రమంలో పడ్డారు. ఈ కార్యక్రమంలో, సెస్ డైరెక్టర్ సందుపట్ల అంజిరెడ్డి, మాజీ జిల్లా కోఅప్షన్ మెంబర్ సర్వర్ పాషా, మాజీ సెస్ డైరెక్టర్ కొమ్ము బాలయ్య, నామపూర్ సర్పంచ్ వెలుముల విజయ, యాదవ సంఘము నాయకులు తాడెపు ఎల్లం, గ్రామశాఖ అధ్యక్షుడు తాడెపు అనిల్, తాడెపు సురేష్, ఏఎంసి డైరెక్టర్లు ఆంజనేయులు, కొత్తపల్లి నారాయణ, సోషల్ మీడియా వారియర్ పరిధిపేట వెంకటేష్, యాదవ సంఘము నాయకులు తదితరులు పాల్గొన్నారు.
Oplus_131072
Oplus_131072
కస్తూరి వెంకట్ రెడ్డి ఆంధ్రప్రభ ముస్తాబాద్

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *