నేరాలు

22 క్వింటాళ్లు పిడిఎస్ రైస్ పట్టుకున్న టాస్క్ ఫోర్స్

128 Views

రామగుండం పోలీస్ కమిషనరేట్

తేది : 05-03-2024

అక్రమంగా రవాణా చేస్తున్న సుమారు 22 క్వింటాళ్ళ పిడిఎస్ రైస్ పట్టుకున్న టాస్క్ ఫోర్సు పోలీసులు.

రామగుండము పోలీస్ కమీషనర్ శ్రీ ఎం. శ్రీనివాసులు .ఐపీఎస్., (ఐజీ)  ఆదేశాల మేరకు ఈరోజు మంచిర్యాల పోలీస్ స్టేషన్ పరిధి చుట్టప్రక్కల ప్రాంతాల నుండి తక్కువ ధరలకు కొనుగోలు చేసి పిడియస్ బియ్యన్ని అక్రమ రవాణా చేస్తున్నరనే నమ్మదగిన సమాచారం మేరకు టాస్క్ ఫోర్సు సిబ్బంది రాకేష్, తిరుపతి, రాజు లు కలిసి సున్నం బట్టి, సూర్య నగర్ ప్రాంతంలో తనిఖీ నిర్వహించి TS 26TA 1280 అశోక లీలాండ్ ట్రాలీ ను ఆపి తనిఖీ చేయగా బ్యాగ్ లలో నింపి ఉన్న పిడియస్ రైస్ సుమారు 22 క్వింటాళ్ల ను ( విలువ సుమారు 70,400) గుర్తించి వాటిని స్వాధీన పరుచుకొని ట్రాలీ లో ఉన్న సదరు వ్యక్తిని అదుపులోకి తీసుకోని తదుపరి విచారణ నిమిత్తం మంచిర్యాల పట్టణ పోలీస్ స్టేషన్ వారికీ అప్పగించడం జరిగింది.

పట్టుబడిన వ్యక్తి వివరాలు

వానరాసి ఉమా మహేశ్వర్ @ మహేందర్ s/o ఉప్పలయ్య @ శ్రీనివాస్, 23 సంవత్సరాలు, బుడిగె జంగం,ఎన్టీఆర్ నగర్, మంచిర్యాల.

Oplus_131072
Oplus_131072
జిల్లపేల్లి రాజేందర్ ఉమ్మడి అదిలాబాద్ జిల్లా ఇంచార్జ్