ప్రాంతీయం

ఆవునూరులో ఘనంగా జన్మదిన వేడుకలు…

247 Views
  1. ముస్తాబాద్, మార్చి 4 (24/7న్యూస్ ప్రతినిధి) ఆవునూరు గ్రామంలో కాంగ్రెస్ పార్టీ ఏఐసీసీ ఓబీసీ కోఆర్డినేటర్ రుద్ర సంతోష్ కుమార్ పుట్టినరోజు వేడుకలు కాంగ్రెస్ పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి మిర్యాలకార్ శ్రీనివాస్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. అనంతరం మిరియాలకార్ శ్రీనివాస్ మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ ఏఐసిసి ఓబీసీ కోఆర్డినేటర్ రుద్ర సంతోష్ ఇలాంటి పుట్టినరోజు వేడుకలు ఇంకెన్నో చేసుకోవాలని కాంగ్రెస్ పార్టీలో తానుఇంకా రాజకీయంగా ఎదగాలని తాను కాంగ్రెస్ పార్టీకి చేస్తున్న ఏనలేని సేవలు మరువలేనిదన్నారు. ఈ పుట్టినరోజుని పురస్కరించుకుని జడ్పిటిసి గుండం నరసయ్య మాట్లాడుతూ ఇలాంటి పుట్టినరోజులు మరెన్నో చేసుకోవాలని కాంగ్రెస్ పార్టీకి తనఎనలేని సేవలు ఎల్లవేళలా ఉండాలని ఎప్పటికప్పుడు పార్టీని ముందుకు నడిపించుకుంటూ వెళుతూ పార్టీలో క్రియాశీల పాత్రపోషిస్తూ తానుఇంకా రాజకీయంగా ఎదగాలని కోరారు. ఈ కార్యక్రమంలో గ్రామశాఖ అధ్యక్షుడు బత్తుల నవీన్, సీనియర్ నాయకులు చిన్ని లక్ష్మారెడ్డి, కిసాన్ సెల్ అధ్యక్షుడు సారగొండ రామ్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీ నాయకులు పాల్గొన్నారు.
Oplus_131072
Oplus_131072
కస్తూరి వెంకట్ రెడ్డి ఆంధ్రప్రభ ముస్తాబాద్