ప్రాంతీయం

బాధితులను ఆదుకోవాలి, సీఎంను అడ్డుకుంటాం…

163 Views

ముస్తాబాద్, మార్చి 4 (24/7న్యూస్ ప్రతినిధి): రాజన్న సిరిసిల్ల జిల్లా విలేకరుల సమావేశంలో బహుజన స్టూడెంట్ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన పత్రిక సమావేశంలో ఈనెల7న రానున్న ముఖ్యమంత్రి రాజన్న సిరిసిల్ల జిల్లాకు అధికారిక పర్యటనను అడ్డుకుంటామని తెలియజేయడం జరుగుతుందని నేరళ్ళ బాదితుల న్యాయం చేయకపోతే కరీంనగర్ లోక్ సభ ఎన్నికలకు ఎలా పోటీచేస్తారు. మాజీ జిల్లా ఎస్పీ విశ్వజిత్ కంపాటి కరీంనగర్ మాజీ డిఐజి రవివర్మ , ఎస్సై రవీందర్ అధికారులపై చట్టపరమైన చర్యలు తీసుకొని బాధితులను తక్షణమే ఆర్థికంగా ఆదుకోవాల ఆరోపించారు. ఈకార్యక్రమంలో పాల్గొన్న జిల్లా అధ్యక్షులు మహమ్మద్ సద్దాం మాట్లాడుతూ దేశం మొత్తం తలదించుకునే విధంగా జరిగిన ఘటనలు నేరెళ్ల, బుడగం జంగం వెంకటేష్, మంథని మధుకర్ పైన న్యాయ విచారణ ఏర్పాటు చేసి బాధితులకు వెంటనే ఆర్థిక సాయం ప్రకటించి కేసులను త్వరితగతిన ప్రత్యేక కోర్టుద్వారా విచారణ జరిపించాలని అసెంబ్లీ సాక్షిగా మాట్లాడిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దానికి ప్రతిగా బదులు ఇచ్చిన మాజీ మంత్రి కేటీఆర్ నేరెళ్ల విషయంలో నీ దమ్మున్న విచారణ చేయించుకో ముఖ్యమంత్రి అని రాష్ట్ర అసెంబ్లీ సాక్షిగా చెప్పడం జరిగింది అయినా కూడా ఈ ఘటనలపై ఎందుకు విచారణ జరిపించడంలేదు మాజీ రాజన్న సిరిసిల్ల జిల్లా ఎస్పీ అయినా విశ్వజిత్ కంపాటి ఐపీఎస్ ఎస్సై రవీందర్, డిఐజి రవివర్మ వారిపై అంతప్రేమ ఎందుకని ప్రశ్నించారు. ఈ చర్య ప్రభుత్వమే ముందుకు వచ్చి నేరెళ్ల ఘటనలో కేటీఆర్ కు ఏసంబంధం లేదు అని ఒక శ్వేతపత్రం అయినా రిలీజ్ చేయాలి. ఈ ఘటనలపై విచారణ చేయని పక్షంలో నేరెళ్ల బాధితులను మరియు నేను కరీంనగర్ లోక్సభకు జరిగే ఎన్నికలలో పై మూడు ఘటనలు గత ప్రభుత్వం చేసిన దుర్మార్గాలనే మేనిఫెస్టోగా పెట్టి ఎన్నికల పోటీలో ఉంటామని తెలియజేయడం జరుగుతుంది. ఈ రోజున ఉదయం ఒకవాయిస్ రికార్డువిన్నాం ఆ వాయిస్ రికార్డులో కేకే మహేందర్ రెడ్డి సిరిసిల్లలో కుటుంబ నియంత్రణ ప్యాకెట్లు అమ్ముకొమ్మని తీవ్రమైన పరుష పదజాలంతో దూషించారని ఈపద్మశాలీలకు బతుకమ్మ చీరల ఆర్డర్స్ ఇవ్వం! పద్మశాలీలు బతుకమ్మ చీరల పేరిట 6ఏండ్ల నుండి దొబ్బి తింటున్నది సరిపోదా పద్మశాలీలు పాపడాలు, కుటుంబ నియంత్రణ ప్యాకెట్లు అమ్ముకొండి అంటూ సిరిసిల్ల కాంగ్రెస్ నాయకుడు కేకే మహేందర్ రెడ్డి జుగుప్సాకరమైన మాటలు. ఘటన పైన విచారణ జరిపి మహేందర్ రెడ్డిపై కూడా చట్టపరమైన చర్యలు తీసుకొని కాంగ్రెస్ పార్టీలో ఉన్న పద్మశాలి నాయకులు కూడా ఈ ఘటనపై స్పందించాలి. ఈ ఘటనలపై విచారణ జరపనిపక్షంలో నేరెళ్ల బాధితులు అందరూ కరీంనగర్ లోక్ సభకు ఎన్నికల బరిలో ణఈ ఘటనపై మాట్లాడుతూ రాష్ట్ర జనరల్ సెక్రటరీ బహుజన స్టూడెంట్ ఆఫ్ ఇండియా రాష్ట్ర సెక్రెటరీ నిమ్మపెళ్లి రాజకుమార్, దళిత డిక్లరేషన్ పేరుతో దళిత ఓట్లు వేయించుకున్న కాంగ్రెస్ పార్టీ దళితులకు న్యాయం చేయాల్సి వచ్చిన సందర్భంలో మాత్రం వెనుకకు పోతుందని తీవ్రమైన ఆగ్రహం చేస్తున్నామని ఆరోపించారు. ఈ ప్రెస్ మీట్ లో జిల్లా అధ్యక్షుడు మొహమ్మద్ సద్దాం, రాష్ట్ర సెక్రెటరీ నిమ్మపల్లి రాజకుమార్ న్యాయవాది, మరటి దినేష్ హైకోర్టు న్యాయవాది, బట్టి భరత్ న్యాయ విద్యార్థి, బెస్తా నరేష్, మరటి సురేష్ పాల్గొన్నారు.

IMG-20251226-WA0281
IMG-20251226-WA0281

రాచర్ల గొల్లపల్లి లో సర్పంచ్ గా గెలిచేది ఎవరు...?
Telugu News 24/7