కొనరావుపేట్ మార్చ్ 4, 24/7 తెలుగు న్యూస్:బాధిత కుటుంబానికి చల్మెడ పరామర్శ. కోనరావుపేట మండలం బావుసాయిపేట గ్రామానికి చెందిన బిఆర్ఎస్ కార్యకర్త వంగల సురేందర్ బాబు తండ్రి మురళి ఇటీవల అనారోగ్యంతో మృతి చెందగా సోమవారం వారి కుటుంబ సభ్యులను వేములవాడ నియోజకవర్గం బిఆర్ఎస్ పార్టీ ఇన్చార్జి చల్మడ లక్ష్మీనరసింహారావు పరామర్శించి ప్రగాఢ సానుభూతి సంతాపాన్ని తెలియజేశారు. వారి వెంట గ్రామ తాజా మాజీ సర్పంచ్ కెందే గంగాధర్, మండల అధ్యక్షుడు మల్యాల దేవయ్య, ప్యాక్స్ చైర్మన్ బండ నరసయ్య, సీనియర్ నాయకులు రాఘవరెడ్డి, రామతీర్థపు రాజు, కౌన్సిలర్ గోలి మహేష్, నాయకులు క్రాంతి కుమార్, గ్రామ శాఖ అధ్యక్షులు బైరగొని రాజేశం, నాయకులు దేవరాజ్, రహిం, హారినాథ్ రావు, షాదుల్, తదితరులు ఉన్నారు.
