(తిమ్మాపూర్ మర్చి 04)
సర్పంచ్ ల పెండింగ్ బిల్లులు రావాలని తిమ్మాపూర్ మండల సర్వసభ సమావేశానికి మన్నెంపల్లి గ్రామ మాజీ సర్పంచ్ మేడి అంజయ్య మందు డబ్బాతో వచ్చి నిరసన తెలిపారు..
ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ….
పూస్తెల తాడు కోదువ పెట్టి, అప్పులు చేసి మా గ్రామంలో అభివృద్ధి పనులు చేశానని అతని ఆవేదన వెలగక్కారు..
సర్పంచ్ లు తిమ్మాపూర్ మండలం లోని అన్ని గ్రామాలలో అభివృద్ధి చేస్తేనే కేంద్ర, రాష్ట్ర అవార్డులు తిమ్మాపూర్ మండలానికి వచ్చాయని ఆవేదన వ్యక్తం చేశారు…
మేము ఆత్మహత్య చేసుకుంటాము పర్మిషన్ ఇయ్యాలని ఎంపీడీవో కార్యాలయంలో జరిగే తిమ్మాపూర్ మండల సర్వసభ సమావేశానికి మందు డబ్బాతో కార్యాలయం లోపటికి వచ్చే ప్రయత్నం చేయడంతో పోలీసులు అతనిని అడ్డుకొని పోలీస్ స్టేషన్ కి తరలించారు…