ముస్తాబాద్, మార్చి 1 (24/7న్యూస్ ప్రతినిధి): ముదిరాజ్ ఎంప్లాయీస్ అండ్ ప్రొఫెషనల్స్ అసోసియేషన్ (మెపా) రాజన్న సిరిసిల్ల జిల్లా కమిటీ అధ్యక్షులుగా ముస్తాబాద్ మండలం, ఆవునురు గ్రామానికి చెందిన గుండవేనీ దేవరాజు ముదిరాజ్ ను, ప్రధాన కార్యదర్శిగా కోనరావుపేట మండలం, వట్టిమల్ల గ్రామానికి చెందిన గండి నరేష్ ముదిరాజ్ ను,ఉపాధ్యక్షులు గా సిరిసిల్ల కి చెందిన పడిగే కొండయ్య, పండుగ శ్రవణ్ లను, జాయింట్ సెక్రటరీ గా వేముల వాడ కి చెందిన పండుగ రాజు లను నియమించినట్లు మెపా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పులి దేవేందర్ ముదిరాజ్ శుక్రవారం నాడు ఒక ప్రకటనలో తెలిపారు. ఈ సందర్భంగా జిల్లా అధ్యక్ష కార్యదర్శులు దేవరజ్,నరేష్ లు మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్రంలో సుమారు 60లక్షల జనాభా ఉన్న ముదిరాజ్ కులస్థులు సరైన రిజర్వేషన్లకు నోచుకోవడం లేదని, వెంటనే ప్రస్తుతం ఉన్న బీసీ-డీ గ్రూపు నుంచి బీసీ-ఏ గ్రూపులోకి మార్చడానికి తగిన చర్యలు తీసుకోవాలని మెపా ఉద్యమిస్తున్నదని అన్నారు. తమను వెంటనే బీసీ-ఏలోకి మార్చాలని, లేదంటే ప్రత్యేక రిజర్వేషన్ గ్రూపును ఏర్పాటు చేయాలని కోరారు. వచ్చే నెలలో జరిగే కులగణనలో ముదిరాజ్ జనాభాను క్షుణ్నంగా లెక్కించాలని, అందుకు కావాల్సిన కార్యాచరణ ప్రారంభించేలా కృషిచేయాలని కోరారు. రూ.1000కోట్లతో ముదిరాజ్ కార్పొరేషన్ను ఏర్పాటు చేసి పూర్తి స్థాయిలో నిధులు కేటాయించాలని కోరారు. తమకు జిల్లా అధ్యక్ష కార్యదర్శులుగా బాధ్యతలు అప్పగించిన మెపా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పులి దేవేందరు, రాష్ట్ర కమిటీకి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.
