(తిమ్మాపూర్ మర్చి 01)
తిమ్మాపూర్ మండలం మన్నెంపల్లి గ్రామ మాజీ ఉపసర్పంచ్, బీఆర్ఎస్ సీనియర్ నాయకుడు పొన్నం అనీల్ గౌడ్ జన్మదినం సందర్భంగా పొన్నం యువసేన అధ్వర్యంలో లయన్స్ క్లబ్ సహకారంతో కరీంనగర్ లోని ప్రభుత్వ హాస్పిటల్ వద్ద చికిత్స పొందుతున్న వారి కుటుంబాలకు అన్నదానం చేశారు..
అనంతరం మన్నెంపల్లి గ్రామం లోని ప్రభుత్వ పాఠశాలలో పదో తరగతి విద్యార్థులకు ఎగ్జామ్ ప్యాడ్లు, పరీక్ష సామగ్రి అందజేశారు…
ఈ కార్యక్రమంలో యూత్ నాయకులు వేణుకుమార్, సదయ్య గౌడ్, నిరంజన్, సంపత్, రమేష్, సాయి కుమార్, నాగేంద్ర, సాయి కుమార్, నవీన్, తదితరులు పాల్గొన్నారు.