ప్రాంతీయం

గాంధీ జయంతి సందర్భంగా ముస్తాబాద్ లో నివాళులర్పించిన వైశ్యులు..

40 Views

ముస్తాబాద్, అక్టోబర్ 2 (24/7న్యూస్ ప్రతినిధి): జాతిపిత మహాత్మాగాంధీ జయంతి సందర్భంగా బుధవారం వైశ్యులు కూర బిక్షపతి అధ్యక్షుల ఆధ్వర్యంలో జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. అనంతరం గాంధీజీ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళుల ర్పించారు. అక్టోబర్2 గాంధీ జన్మించిన దినం భారతదేశంలో గాంధీ జయంతి ఎంతో గొప్పగా జరుగుతుందన్నారు. గాంధీ చెప్పిన అహింసా, శాంతి, న్యాయం, సమానత్వం అనే నినాదంతో ముందుకెళ్లారని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో జనరల్ సెక్రటరీ పప్పుల శ్రీకాంత్, బండారి సత్తయ్య, గంద సత్యనారాయణ, ఉప్పల చంద్రం, కూర సంతోష్, వైశ్యులు, గ్రామపంచాయతీ కార్యదర్శి రమేష్, బిక్షపతి, రాజు, రవి సిబ్బంది తదితరులు పాల్గొన్నారు

Oplus_131072
Oplus_131072
కస్తూరి వెంకట్ రెడ్డి ఆంధ్రప్రభ ముస్తాబాద్