ముస్తాబాద్, ఆగస్టు 18 (24/7న్యూస్ ప్రతినిధి): చీకోడ్ గ్రామంలో గౌడ సంఘం ఆధ్వర్యంలో అధ్యక్షులు గున్నాల గణేష్ గౌడ్ అధ్యక్షతన శ్రీ శ్రీ శ్రీ సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ మహారాజ్ 374వ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈసందర్భంగా కేక్ కట్ చేసి, గ్రామస్తులకు మిఠాయి పంపిణీ చేశారు. గున్నాల గణేష్ గౌడ్ మాట్లాడుతూ బహుజన తొలి రాజ్యాధికార పోరాటయోధుడు సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ సామాన్యుడిగా జన్మించి ఆధిపత్య కులాల అధికారాన్ని బానిసత్వాన్ని ధిక్కరించి బడుగు బలహీన వర్గాలను రాజ్యాధికారం వైపు నడిపిన తొలి బహుజన రాజు సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ అని పేర్కొన్నారు. కార్యక్రమంలో గౌడ సంఘం సభ్యులు మరియు గ్రామస్తులు పాల్గొన్నారు.
