ముస్తాబాద్, మార్చి1 (24/7న్యూస్ ప్రతినిధి): మండల కేంద్రంలోని పుల్చేరు కుంట కట్టపైన కొలువుదీరిన మైసమ్మతల్లి ఎంతో కాలంగా తాత్కాలిక పూజలు అందుకున్న ఈ సంవత్సరం తొలితగా భక్తులకు అమితంగా భక్తి పెరిగి ఊపందుకొని మొదటి వార్షికోత్సవ వేడుకలను అత్యంత వైభవపేతంగా శుక్రవారం ఘనంగా నిర్వహిస్తున్నారు. అంతేకాకుండా నేటి నుండి మూడు రోజుల వరకు కొనసాగుతందని ప్రథమ వార్షికోత్సవ సందర్భంగా అధిక సంఖ్యలో గ్రామస్తులు అంగరంగ వైభవంగా కన్నుల పండుగగా నిర్వహించారు. లక్ష్మీవారం కలిసి
రావడం విశేషం.. ఆలయ ఆధ్వర్యంలో ప్యాక్స్ చైర్మన్ అన్నం రాజేందర్ రెడ్డి దంపతులతో పాటు తాళ్ల రాజు దంపతులు, పుల్లూరిరవి దంపతులు, మరికొందరు దంపతులు వేద బ్రాహ్మణోత్తములచే ప్రత్యేక పూజ కార్యక్రమలో పాల్గొని, అభిషేకాలు, హోమం నిర్వహించారు. అనంతరం ఆలయ నిర్వాహక కమిటీ సభ్యులు అత్యంత భక్తి శ్రద్ధలతో భక్తులందరి సహాయ సహకారాలతో పూజల నిర్వహించి తీర్థప్రసాదాలు అందించి మహా అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఈకార్యక్రమంలో భాగంగా ఆలయ కమిటీ సభ్యులు, పార్టీలకు సంబంధం లేకుండా వివిధ హోదాలు కలిగిన నాయకులు, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.
