– సీనియర్ జర్నలిస్ట్ బాస్కర్ గౌడ్
దౌల్తాబాద్: ఎడతెరిపి లేని వర్షాలతో దేశ ప్రజలు అప్రమత్తంగా ఉండాలని దౌల్తాబాద్ మండల సీనియర్ జర్నలిస్ట్ అబ్బాగౌని భాస్కర్ గౌడ్ అన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఉమ్మడి మండలంలోని పలు గ్రామాలలో అధిక వర్షపాతంతో ఇండ్లు దెబ్బ తిన్న, ఎవరికైనా ప్రమాదం వాటిల్లిన వెంటనే దౌల్తాబాద్ ప్రెస్ క్లబ్ సభ్యులకు, ఆయా గ్రామాల సర్పంచులకు,ఉప సర్పంచులకు,ఎంపిటిసీలకు, సంబంధిత వార్డు సభ్యులకు, పలు గ్రామాల పంచాయతీ కార్యదర్శులకు సమాచారం అందించగలరని సూచించారు. ఏదేమైనా ప్రజలు మాత్రం పాత శిథిలావస్థకు చేరిన ఇండ్లల్లో ప్రజలు ఉండడం క్షేమకరం కాదని గ్రామాల్లో చెరువులు, కుంటలు పొంగిపొర్లుతుండడంతో ప్రజలు ఎవరు బయటకు రావద్దని సూచించారు. ఎవరికైనా ఎలాంటి సహాయం కావాలన్నా, అధికారులు అందరూ అందుబాటులో ఉంటారని వారు తెలిపారు…