రాజకీయం

కాంగ్రెస్ చిల్లర బుద్దులు ప్రజలకు తెలుస్తున్నాయి….

110 Views

–జిల్లా బీజేపీ అధ్యక్షులు గంగాడి కృష్ణారెడ్డి.

(తిమ్మాపూర్ పిబ్రవరి 27)

హుస్నాబాద్ నియోజకవర్గం లో కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ చేస్తున్న ప్రజాహిత యాత్ర పై రాళ్ళ దాడి చేసిన కాంగ్రెస్ నాయకుల చిల్లర బుద్ధులను ప్రజలు గమనిస్తున్నారని కరీంనగర్ జిల్లా బీజేపీ అధ్యక్షులు గంగాడి కృష్ణారెడ్డి పేర్కొన్నారు.

తిమ్మాపూర్ మండల కేంద్రంలో మంగళవారం నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ కరీంనగర్ పార్లమెంట్ పరిధిలో శాంతియుతంగా జరుగుతున్న ప్రజాహిత యాత్ర లో ప్రజలు స్వచ్ఛందంగా పాల్గొంటుండటంతో కాంగ్రెస్ నాయకులు ఓర్వలేక పోతున్నారని అన్నారు.

సంజయ్ మాటలను వక్రీకరణ చేసి లేనిపోని కాంగ్రెస్ వారు రాద్దాంతం చేస్తున్నారని అన్నారు.గతంలో బండి సంజయ్ పై కరీంనగర్ లో పోటీ చేసిన పొన్నం ప్రభాకర్ మూడవ స్థానంలో నిలిచిన సందర్బం ఇంకా మర్చిపోలేక ఇలా దాడులు చేసి చిల్లర గుణాన్ని ప్రదర్శిస్తున్నారని అన్నారు.

ప్రజాస్వామ్య బద్ధంగా జరుగుతున్న యాత్ర కు పోలీస్ యంత్రాంగం బందోబస్తు కలిగించాలని లేనిపక్షం లో ప్రజలే రక్షణగా ఉంటారని తెలిపారు.

మరోసారి ఇలాంటి దాడులు చేసినట్లుయితే పార్టీ కార్యకర్తలు కూడా ప్రతి దాడులు చేస్తామని హెచ్చరించారు.

Oplus_131072
Oplus_131072
కొమ్మెర రాజు తిమ్మాపూర్