-తెలంగాణలో బిజెపి అధికారంలోకి రావడం ఖాయం.
-అల్జాపూరి శ్రీనివాస్
(మానకొండూర్ అక్టోబర్ 20)
మానకొండూర్ నియోజకవర్గం కేంద్రంలో “నియోజవర్గ ఎన్నికల సన్నాహ సమావేశం” నిర్వహించారు.
ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా బిజెపి ఆదిలాబాద్ జిల్లా పార్లమెంటు ప్రబారి అల్జాపూరి శ్రీనివాస్ హాజరై మాట్లాడుతూ…
తెలంగాణ రాష్ట్రం కల్వకుంట్ల కుటుంబం చేతిలో బందీ అయిందని, ముఖ్యమంత్రి కేసీఆర్ నిరంకుశ పాలన వల్ల నిరుద్యోగులు, రైతులు దళితులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారని అన్నారు. బిఆర్ఎస్ పార్టీని ప్రజలు బొంద పెట్టాలని అన్నారు. కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలను గెలిపిస్తే మళ్లీ టిఆర్ఎస్ పార్టీలోకి వెళ్తారని వారికి ఎటువంటి పరిస్థితుల్లో ఓట్లు వేయద్దని పిలుపునిచ్చారు.
ఈ సందర్భంగా బిజెపి జిల్లా అధ్యక్షుడు గంగాడి కృష్ణారెడ్డి, బిజెపి నాయకులు మాజీ ఎమ్మెల్యే ఆరేపల్లి మోహన్ మాట్లాడుతూ…
మానకొండూరు నియోజకవర్గం లో టిఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలు ప్రజలను ఓట్లు అడిగే అర్హత లేదని అన్నారు. డాక్టర్, యాక్టర్ వద్దని స్థానిక నేతనే గెలిపియాలని పిలుపునిచ్చారు.
ఈ కార్యక్రమంలో రాష్ట్ర కార్యవర్గసభ్యులు ఈనుగొండ నాగేశ్వర్ రెడ్డి, జిల్లా ప్రధాన కార్యదర్శి మాడ వెంకటరేడ్డి, జిల్లా ఉపాధ్యక్షులు గుర్రాల వెంకటరెడ్డి, రంగు భాస్కరాచారి, రాష్ట్ర కౌన్సిల్ సభ్యులు దండు కొమురయ్య, జిల్లా అధికార ప్రతినిధులు అలివేలు సమ్మిరెడ్డి, బొంతల కళ్యాణ్ చంద్ర, అసెంబ్లీ కన్వీనర్ ముత్యాల జగన్ రెడ్డి, మానకొండూరు తిమ్మాపూర్ గన్నేరువరం మండల పార్టీల అధ్యక్షులు రాపాక ప్రవీణ్, సుగుర్తి
జగదీశ్వరచారి, నగునూరి శంకర్, తిమ్మాపూర్ మాజీ జెడ్పిటిసి ఎడ్ల జోగిరెడ్డి, కేశపట్నం మాజీ ఎంపీపీ దొంగల రాములు, మానకొండూరు అసెంబ్లీ నియోజకవర్గ కార్యకర్తలు నాయకులు తదితరులు పాల్గొన్నారు..