కోనరావుపేట/ రిపోర్టర్ కరుణాకర్/ రాజన్న సిరిసిల్ల జిల్లా కోనరావుపేట మండలంలోని మరిమడ్ల, గ్రామంలో దళితులు సాగు చేస్తున్న పోడు భూములను సిపిఐ జాతీయ కార్యవర్గ సభ్యులు మాజీ శాసనసభ్యులు చాడ వెంకటరెడ్డి పరిశీలించారు. ముందుగా గ్రామంలోని అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేశారు. అనంతరం గ్రామంలోని 80 మంది దళిత కుటుంబాలు సాగుచేసుకుంటున్న 100 ఎకరాల పోడు భూములను రైతులతో కలిసి వెళ్లి పరిశీలించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ అంబేద్కర్ రచించిన రాజ్యాంగం ప్రకారం ప్రతి ఒక్క పేదవాడికి ప్రకృతి అందించిన సహజ వనరులు అన్ని విధాలుగా దక్కాలని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అంబేద్కర్ రచించిన రాజ్యాంగాన్ని అమలు చేయాలని 1946లో దున్నేవాడిదే భూమి అని నినాదం ఏర్పడి తెలంగాణలో ఎందరో కమ్యూనిస్టులు పోరాట ఫలితంతో 10 లక్షల ఎకరాల భూమిని పంచారని వారి త్యాగాలు మరువలేనివని ఎర్రజెండా పార్టీల పోరాటాల ద్వారానే రైతులకు అనేక చట్టాలు అమలయ్యాయని అటవీ హక్కుల చట్టం సిపిఐ పార్టీ పోరాటం ద్వారానే వచ్చిందని కానీ రాష్ట్ర ప్రభుత్వం దానిని సరిగా అమలు చేయడం లేదని వెంటనే అమలు చేయాలని గతంలో అసిఫాబాద్ జిల్లా నుంచి అశ్వరావుపేట వరకు పోడు భూముల కోసం పాదయాత్ర చేశామని దీంతో ప్రభుత్వ యంత్రాంగం దిగివచ్చి అర్హులైన వారికి పోడు భూములకు అటవీ హక్కుల చట్టం ప్రకారం హక్కులు కల్పిస్తామని తెలిపారని ప్రకృతి అందించిన సహజ వనరులు పేదోడికి అందాలని అది ఏ ఒక్కరి సొత్తు కాదని భూముల కు హక్కు పత్రాలు దక్కేవరకు పోరాటం ఆపవద్దని సిపిఐ పార్టీ ఎప్పుడు అండగా ఉంటుందనిఅన్నారు. రాష్ట్ర ప్రభుత్వం వెంటనే పెన్షన్లు నిరుద్యోగ భృతి కొత్త రేషన్ కార్డులు మంజూరు చేయాలని లేనియెడల సిపిఐ పార్టీ ప్రజల తరఫున పోరాటం చేస్తుందని రాష్ట్రంలో బిజెపి పార్టీ అధికారంలోకి రానివ్వకూడదని నరేంద్ర మోడీ పాలనలో బిజెపి మతోన్మాద పార్టీగా మారిందని పేదవాడికి న్యాయం జరగదని బిజెపి అధికారంలోకి వస్తే స్వేచ్ఛగా తిరిగే హక్కు కూడా ఉండదని పేద ప్రజల హక్కులకై భారత కమ్యూనిస్టు పార్టీ పోరాటాలు చేస్తూ అండగా ఉంటుందని భూములు దక్కేవరకు ప్రతి ఒక్కరు పోరాడాలని అన్నారు. ఈ కార్యక్రమంలో సిపిఐ జిల్లా కార్యదర్శి గుంటి వేణు, మండల కార్యదర్శి మల్యాల జాన్సన్, జిల్లా నాయకులు జంగం అంజయ్య, కడారి రాములు, రైతులు దిలీప్, రాజనర్సయ్య, మహిళా రైతులు తదితరులు పాల్గొన్నారు.
