రాజకీయం

ఎంపీ బండి సంజయ్ దిష్టి బొమ్మ దగ్ధం..

148 Views

బగ్గుమన్న కాంగ్రెస్ నాయకులు..

(తిమ్మాపూర్ ఫిబ్రవరి 27)

కాంగ్రెస్ పార్టీ బీసీ సంక్షేమ శాఖ మంత్రి పోన్నం ప్రభాకర్ పై కరీంనగర్ ఎంపి బండి సంజయ్ చేసిన అనుచిత వ్యాఖ్యలకు నిరసనగా తిమ్మాపూర్ మండల కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో అల్గునూర్ చౌరస్తా లో బండి సంజయ్ దిష్టిబొమ్మ దహనం చేసి నిరసన వ్యక్తం చేశారు.

ఈ సందర్బంగా కాంగ్రెస్ నాయకులు మాట్లాడుతూ…

ఎలక్షన్లు రాగానే మతలను, పార్టిలను,యువతను రెచ్చగొడుతూ పబ్బం కట్టుకునే బండి సంజయ్ అధికారంలోకి వచ్చిన ఐదేళ్లలో నియోజకవర్గానికి ఏమి పీకడాంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు..

తెలంగాణ కోసం ఉద్యమం చేసిన ఒక మహానీయుడిపై అనుచిత వ్యాఖ్యలు చేయడం సిగ్గు చేటు అన్నారు..

ఎంపి స్థాయిలో ఉండి మహిళలను కించపరిచే విధంగా మాట్లాడడం నీ స్థాయికి నిదర్శనం అని అన్నారు..

మంత్రి పొన్నం ప్రభాకర్ పై చేసిన అనుచిత వ్యాఖ్యలను ఉపసంహరించుకుని క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. లేని యెడల బండి సంజయ్ ని ఎక్కడకక్కడ అడ్డుకుంటామని హెచ్చరించారు.

ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ జిల్లా నాయకులు, మండల నాయుకులు, తదితరులు పాల్గొన్నారు..

No Slide Found In Slider.

Poll not found