ముస్తాబాద్, ఫిబ్రవరి 26 (24/7న్యూస్ ప్రతినిధి) తెర్లుమద్ది గ్రామంలోని మోతుకుల కుంట చెరువులో సుమారుగా మూడు వేలకు పైచిలుకు చేపలు అనుమానాస్పదంగా చనిపోవడంతో ఎవరైనా విషం కలిపారా? లేదా నీరుతగ్గడంతో చనిపోయాయా? అనే కోణంలో స్థానికులకు పలు అనుమానాలకు దారితీస్తూ వాట్సాప్ లలో చెక్కర్లు కొడుతున్నాయి. ఎవరైనా ఈ నేరానికి పాల్పడినట్లయితే సంబంధిత అధికారులు తగిన చర్యలు తీసుకోవాలని ముదిరాజ్ కులస్తులకు న్యాయం చేకూరేలా చూడాలని వాట్సాప్ లో మెసేజ్ పెడుతున్నారు.
