ప్రాంతీయం

అమృత్ భారత్ పథకం

83 Views

దేశంలో మౌలిక సదుపాయాలు అభివృద్ధికి మోదీ ప్రభుత్వం లక్షల కోట్ల రూపాయలు ఖర్చు- బీజేపీ మంచిర్యాల జిల్లా అధ్యక్షులు రఘునాథ్ వెరబెల్లి.

అమృత్ భారత్ పథకంలో బాగంగా ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈరోజు వర్చువల్ గా మంచిర్యాల రైల్వే స్టేషన్ పునర్ నిర్మాణ పనులకు శంఖుస్థాపన మరియు జిల్లాలో మూడు అండర్ పాస్ ల ప్రారంభోత్సవ కార్యక్రమంలో మంచిర్యాల రైల్వే స్టేషన్ లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో బీజేపీ మంచిర్యాల జిల్లా అధ్యక్షులు రఘునాథ్ వెరబెల్లి పాల్గొని మంచిర్యాల అమృత్ భారత్ రైల్వే స్టేషన్ పునర్ నిర్మాణ పనులు శంఖుస్థాపన మరియు మూడు అండర్ పాస్ లను రైల్వే అధికారులుతో కలిసి ప్రారంభించడం జరిగింది.

ముందుగా విద్యార్థులు రైల్వే అధికారులు విద్యార్థులచే సాంస్కృతిక కార్యక్రమాలను ఏర్పాటు చేయడం జరిగింది. అనంతరం రైల్వే అభివృద్ది పై చెప్పట్టిన డ్రాయింగ్, వ్యాస రచన పోటీల్లో పాల్గొన్న విజేతలకు రఘునాథ్ , ఛాంబర్ ఆఫ్ కామర్స్ చైర్మన్ గుండా సుధాకర్ మరియు రైల్వే అధికారులు బహుమతులు ప్రధానం చేయడం జరిగింది.

అనంతరం మోదీ ఢిల్లీ నుండి వర్చువల్ గా దేశంలో 554 రైల్వే స్టేషన్ లు పునర్ నిర్మాణ పనులకు మరియు 1500 రైల్వే ఓవర్ బ్రిడ్జి లు మరియు అండర్ పాస్ లు వర్చువల్ ప్రారంభించి ప్రసంగించడం జరిగింది.

ఈ సందర్భంగా రఘునాథ్ మాట్లాడుతూ గత 10 సంవత్సరాల పాలనలో నరేంద్ర మోదీ ప్రభుత్వం దేశంలో మౌలిక సదుపాయాలు అభివృద్ధికి లక్షల కోట్ల రూపాయలు కేటాయించి ప్రజలకు అన్ని రకాల సదుపాయాలు కల్పిస్తున్నారని అన్నారు. మంచిర్యాల జిల్లాలో నలుమూలల అభివృద్ధికి జాతీయ రహదారులు మరియు రైల్వే స్టేషన్ అభివృద్ధికి కోట్ల రూపాయలు కేటాయించి ప్రజలకు అన్ని రకాల సదుపాయాలు అందిస్తున్నారని అన్నారు. దేశంలో నరేంద్ర మోదీ నాయకత్వంలో ప్రపంచంలోనే అగ్రగామిగా నిలిచింది అని అన్నారు. మూడో సారి కేంద్రంలో అధికారంలో వచ్చేది బీజేపీ ప్రభుత్వమే అని కొత్త ప్రభుత్వం ఏర్పడ్డాక మంచిర్యాల రైల్వే స్టేషన్ లో మరిన్ని రైళ్ల నిలుపుదలకు కేంద్ర రైల్వే మంత్రి ని కోరుతామని అన్నారు.

Oplus_131072
Oplus_131072
జిల్లపేల్లి రాజేందర్ ఉమ్మడి అదిలాబాద్ జిల్లా ఇంచార్జ్