రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలం రాచర్ల బొప్పాపూర్ గ్రామానికి చెందిన చిదుగు రవి గౌడ్ హైదరాబాదులోని నిమ్స్ ఆస్పత్రిలో 15 రోజుల నుండి అంతు చిక్కని వ్యాధితో పోరాడుతూ ఈరోజు ఉదయం 11:45 నిమిషాలకు మృతి చెందాడు చీదుగు రవి గౌడ్ కు తండ్రి కిషన్ గౌడ్ అన్నయ్య రాజేష్ గౌడ్ లు ఉన్నారు వీరి చిన్న వయసులోనే తల్లిని కోల్పోయారు మరియు అక్కను కూడా కోల్పోయారు తండ్రికి చేదోడు వాదోడుగా ఉంటున్నారు వీరికి రాచర్ల బొప్పాపూర్ గ్రామంలో ఉండటానికి ఇల్లు కూడా లేని పరిస్థితి చిదుగు రవి గౌడ్ ను దహన సంస్కారానికి రాచర్ల బొప్పాపూర్ గ్రామానికి తీసుకు వస్తున్నామని కుటుంబసభ్యులు సమాచారమిచ్చారు దయనీయ స్థితిలో శోకసముద్రంలో మునిగిన వీరి కుటుంబాన్ని రాచర్ల బొప్పాపూర్ గౌడ సంఘ సభ్యులు మరియు ప్రజాప్రతినిధులు ఆదుకొని దహన సంస్కారానికి సహకరించగలరని శోకతప్త హృదయాలతో వేడుకుంటున్నారు
