ముస్తాబాద్, ఫిబ్రవరి 23 (24/7న్యూస్ ప్రతినిధి): మండల కేంద్రంలోని శ్రీ సమ్మక్క సారలమ్మ జాతర మహోత్సవంలో భాగంగా సిరిసిల్ల నియోజకవర్గ ఇన్చార్జ్ కేకే మహేందర్ రెడ్డి సమ్మక్క సారలమ్మ మహోత్సవ భాగంగా పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఆ మాతృమూర్తుల ఆశీస్సులు ప్రజలందరి మీద ఉండాలిని కోరారు. ఈ కార్యక్రమంలో మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ఏళ్లబాల్ రెడ్డి, జడ్పిటిసి గుండం నర్సయ్య, పట్టణ అధ్యక్షులు గజ్జలరాజు, ఎంపిటిసి గుండెల్లి శ్రీనివాస్ గౌడ్, తలారి నర్సింలు, రంజాన్ నరేష్, కొమురయ్య, ఉచ్చిడి బాల్ రెడ్డి, కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలు భక్తులు పాల్గొన్నారు.
