ముస్తాబాద్ వెంకటరెడ్డి మార్చి19, అల్వపీడధ్రోని ప్రభావంతో ఉరుములు మెరుపులతో వడగండ్ల ఈదురుగాలుల వర్షం ప్రభావందాటికి ముస్తాబాద్ మండలంలోని కొండాపూర్, ఆవునూర్, రామలక్ష్మపల్లె, గూడెం, గన్నవారిపల్లెతో పాటు పలు గ్రామాలలో శనివారంరోజున రైతులను కోలుకోలేని దెబ్బతీశాయి. వరిపంటలపై ఆధారపడిన రైతులకు అపారమైన నష్టం వాటిల్లిందని వరి చేనులు చిరుపొట్టదశలో ఉండడంచేత పంట చేతికందకుండా పోయింది రైతన్నలు ఆరుగాలం పండించిన పంటలు వర్షార్పుణం కావడంతో రైతులు జీర్ణించుకోలేకపోతున్నారని తెలుసుకున్నారు. ఈసందర్భంగా మండలంలోని బీఆర్ఎస్ పార్టీ నాయకులు విలేకరుల సమావేశంలో ఎంపీపీ జనగామ శరత్ రావు, రైతుబంధు అధ్యక్షులు కల్వకుంట్ల గోపాలరావు, జడ్పిటిసి గుండం నరసయ్య, మాట్లాడుతూ మండలంలోని పలు గ్రామాలలో ఎక్కడ చూసినా రైతులకు ఆకపారమైన నష్టం వాటిల్లిందని ఈవిషయాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి జిల్లా కలెక్టర్ కు నివేదిక సమర్పించి రైతులు ఆరుగాలం పండించిన పంటల వడగండ్ల వర్షదాటికి నష్టమైందని వివరించి నష్టపరిహారం అందేలా చూస్తామని రైతులను ఆదుకునేందుకు ముందు వరసలో ఉంటామని అన్నారు. ఈకార్యక్రమంలో పట్టణ అధ్యక్షుడు ఎద్దండి నరసింహారెడ్డి ఆధ్వర్యంలో బొంపల్లి సురేందర్ రావు, సెస్ డైరెక్టర్ అంజిరెడ్డి, అక్కరాజ్ శ్రీనివాస్, కనమేని శ్రీనివాసరెడ్డి, తాళ్ల రాజు, దబ్బెడ ఎల్లం, బిఆర్ఎస్ పార్టీ ప్రజాప్రతినిధులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.
