వలస జీవి హఠాత్ మరణం
రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలం రాచర్ల బొప్పాపూర్ గ్రామానికి చెందిన నిమ్మల రాజు వయస్సు 45 బహ్రెయిన్ దేశము గత 10 సంవత్సరాల నుండి డ్రైవర్ వృత్తిపైన వెళ్లి జీవనం సాగిస్తున్నాడు శుక్రవారం రోజున మధ్యాహ్నం రెండు గంటల సమయంలో బహ్రెయిన్ దేశంలో తాను నివాసం ఉంటున్న రూమ్ నుండి తాను డ్రైవర్ వృత్తి చేస్తున్న డ్యూటీకి వెళ్దామని రెడీ అవ్వగా హఠాత్తుగా ఛాతిలో నొప్పి రాగానే మిత్రులకు తెలియజేయగా వారు హుటాహుటిన ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గమధ్యంలో మృతి చెందాడని బహ్రెయిన్ లోనీ మృతునీ నిమ్మల రాజు మిత్రులు ఇండియాలోని రాచర్ల బొప్పాపూర్ గ్రామంలో వారి కుటుంబ సభ్యులకు తెలియపరిచారు మృతునికి భార్య జ్యోతి 40 సంవత్సరాలు కూతురు మిల్కీ13 సంవత్సరాలు కుమారుడు కన్నయ్య 15 సంవత్సరాల వయసు గలవారున్నారు నిమ్మల రాజు మృతితో రాచర్ల బొప్పాపూర్ గ్రామంలో వారి కుటుంబంలో విషాద ఛాయలు అలుముకున్నాయి





