దళిత ఎమ్మెల్యేకు అవమానం జరిగిందని రాయపోల్ మండలం ప్రెస్ క్లబ్ ఆధ్వర్యంలో బహుజన సమాజ్ పార్టీ తరుపున గత రెండు రోజుల కింద చనిపోయినటువంటి కంటోన్మెంటు ఎమ్మెల్యే జి.సాయన్న మృతి పట్ల బాదను వ్యక్తం చేస్తూ గతంలో ఐదుసార్లు ఏకధాటిగా ఎమ్మెల్యేగా గెలిచి ప్రజలకు ఎంతో సేవ చేశాడు. అతను కేవలం ఒక దళిత ఎమ్మెల్యే అయినందుకు ఈరోజు భారత రాష్ట్ర సమితి అధికార పార్టీ ఎలాంటి చర్య తీసుకోకుండా సాయన్న యొక్క అంత్యక్రియలకు హాజరుకాకుండా ఎలాంటి ప్రభుత్వ అధికారిక లాంచనాలు లేకుండా అంత్యక్రియలు జరపడం అధికార పార్టీ యొక్క దుశ్చర్యగా భావిస్తునదని అయితే తమ అవసరం కోసం దళితుల యొక్క కాళ్లు పట్టుకోవడం అవసరం తీరాక మెడ పట్టుకోవడం లాంటి దురదృష్టకర పరిస్థితులు కేవలం ఈ ప్రభుత్వంలోనే జరగడం ప్రజలు గమనిస్తున్నారని రాబోయే రోజుల్లో ఇలాంటి ప్రభుత్వాన్ని కుప్ప కూల్చి తగిన బుద్ధి చెప్తారని బహుజన సమాజ్ పార్టీ తరఫున హెచ్చరించడం జరిగింది. ఈ కార్యక్రమంలో దుబ్బాక నియోజకవర్గం ఇంచార్జి అనాజిపూర్ సంజీవ్, ప్రధాన కార్యదర్శి బొల్లం రాజేష్, రాయపోల్ మండల అధ్యక్షులు సొక్కమ్ స్వామి, దౌల్తాబాద్ మండల ప్రధాన కార్యదర్శి శ్రీ రాముల సుధాకర్ పాల్గొన్నారు.




