నిరుద్యోగులకు రెండు నెలల లోనే 25వేల పై చిలుకు ఉద్యోగాలు
రెండు గ్యారెంటీలు అమలు చేసాం మరో రెండు గ్యారెంటీలు అమలు చేస్తాం
చట్టం ఎవరి చుట్టం కాదు
అవినీతి ఆక్రమాలపై అధికారులకు ఫిర్యాదులు అందగానే చర్యలు తీసుకోవాలి
సిరిసిల్ల శాసనసభ నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ కేకే మహేందర్ రెడ్డి
ఎల్లారెడ్డిపేట ఫిబ్రవరి 16 :
నీతివంతమైన ప్రజాపాలన దిశగా తెలంగాణ రాష్ట్ర గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇందిరా కాంగ్రెస్ ప్రభుత్వం పని చేస్తుందని సిరిసిల్ల శాసనసభ నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జి కేకే మహేందర్ రెడ్డి అన్నారు
బిఆర్ఎస్ పార్టీ పట్టణ అద్యక్ష పదవికి రాజీనామా చేసి కాంగ్రెస్ పార్టీ ఇంచార్జీ కెకె మహేందర్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ పార్టీ లో చేరిన బండారి బాల్ రెడ్డి కి కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జి కెకె మహేందర్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు, అనంతరం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో కేకే మహేందర్ రెడ్డి మాట్లాడుతూ రేవంత్ రెడ్డి చేపడుతున్న అభివృద్ధి కార్యక్రమాలను చూసి కాంగ్రెస్ పార్టీ లో పార్టీ లో చేరి నందుకు సంతోషంగా ఉందన్నారు , రాష్ట్రవ్యాప్తంగా బిఆర్ఎస్ పార్టీపై ఉన్న ప్రజల భ్రమలు తొలగిపోయినాయని ఆయన అన్నారు,
కాగు నివేదికలను చూసినట్లయితే ఇవ్వళ్ళ రాష్ట్రంలో ఏ విధంగా అవినీతి అరాచకాలకు విధ్వంసాలకు బిఆర్ఎస్ పార్టీ అవకాశమిచ్చింది దానిలో భాగస్వామ్యమై దోచుకుని దాసుకుందన్నారు,
బిఆర్ ఎస్ ప్రభుత్వం కాలేశ్వరం ప్రాజెక్టు అవినీతి మొదలుకుని ఆఖరుకు మూగజీవాలను కూడా వదిలిపెట్టలేదు గొర్రెల పెంపకంలో కూడా అనేక అవకతవకలకు పాల్పడింది సిగ్గుతో తలవంచుకునే విధంగా ట్రాన్స్పోర్ట్ లో ఒక మామూలు మోటార్ సైకిల్ పైన కొన్ని యూనిట్లు గొర్రెలను ట్రాన్స్పోర్ట్ చేసినట్లు రాయడం జరిగిందని ఎంత నీచాతి నీచంగా గత బిఆర్ఎస్ పార్టీ దోపిడికి పాల్పడిందని ఈ రాష్ట్రంలో ఆ నలుగురే కాకుండా ఈ ప్రాంతంలో ఉన్న బిఆర్ఎస్ పార్టీ నాయకులు కూడా నిసిగ్గుగా దోపిడీకి పాల్పడి దోసుకున్న వైనం ఒక్కొక్కటిగా బయటపడుతుందన్నారు ,
భూములను, ఇసుకను, చెట్లను , గుట్టలను, నీళ్లలోని చేపలను కూడా వదలలేదు దేన్ని వదలకుండా దోపిడీకి పాల్పడింది బిఆర్ఎస్ పార్టే నని మా కాంగ్రెస్ పార్టీ అనలేదు కాగ్ నివేదికనే తేటతెల్లం చేసిందనీ రాష్ట్రంలో ఉన్న పత్రికలన్నీ నేడు కోడై కూస్తుంది నిజం కాదా ఇప్పటికైనా బిఆర్ఎస్ పార్టీ నాయకులు సిగ్గుతో తలదించుకోవాలని అన్నారు,
కెసిఆర్, కేటీఆర్ హరీష్ రావు ఈ సన్నాసులు అధికారం కోల్పోయి అసెంబ్లీ లో భయట మతి భ్రమించి సిగ్గులేకుండా నిసిగ్గుగా మాట్లాడుతున్న వైనాన్ని ఆయన తీవ్రంగా ఖండించారు,
వారు మాట్లాడుతున్న భాష వారు మతిభ్రమించి మాట్లాడుతున్నట్లు కనిపిస్తుంది మతిభ్రమిస్తే వారిని పిచ్చాసుపత్రులో ఉంచాలి స్థానిక నాయకులు తీసుకపోయి పిచ్చి ఆసుపత్రుల్లో జైయిన్ చేయాలని ఆయన ఎద్దేవా చేశారు,
స్థానిక బిఆర్ఎస్ పార్టీ నాయకులు వారిని తీసుకపోయి పిచ్చాసుపత్రుల్లో జాయిన్ చేయాలని అన్నారు,
డబుల్ బెడ్ రూమ్ లు ఇప్పిస్తామని , దళిత బంధువు ఇప్పిస్తామని, పోడు భూములను ఇప్పిస్తామని స్థానిక బిఆర్ఎస్ పార్టీ నాయకులు డబ్బులు వసూలు చేశారని అవినీతి ఆక్రమాలను సహించేది లేదని అవినీతిని కక్కించే బాధ్యత అదికారులదన్నారు,
అధికారులు ప్రజలకు అందుబాటులో ఉండాలని అవినీతి అక్రమాలపై ఫిర్యాదులు రాగానే వారిపై చర్యలు తీసుకోవాలని వారి బండారం బయటపెట్టాలని కేకే మహేందర్ రెడ్డి అన్నారు,
ఈ కార్యక్రమంలో మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు లక్ష్మారెడ్డి, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు దొమ్మాటి నర్సయ్య, జిల్లా ఉపాధ్యక్షులు షేక్ గౌస్, బుగ్గ కృష్ణమూర్తి, నాయకులు మల్లారెడ్డి , దేవయ్య , లింగం గౌడ్ ,గంట బుచ్చగౌడ్ అనవేని రవి, రాంరెడ్డి , శ్రీనివాస్ , గుర్రం రాములు, రాజు ,సురేష్ , బాలయ్య తదితరులు పాల్గొన్నారు
