Breaking News

నస్పూర్ మున్సిపాలిటీ పరిధిలో పెద్ద కాలువ మట్టి తీసివేత

43 Views

మంచిర్యాల జిల్లా.

నస్పూర్ మున్సిపాలిటీ పరిధిలో పెద్ద కాలువ మట్టి తీసివేత

నస్పూర్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధలోని 7 వార్డు జాన్సీనగర్ లో గత 10 ఏళ్ళు నుండి పెద్దకాలువ మట్టితో నిండి వర్షాలకు నీళ్ళు ఇళ్లలకు రావడం వలన నష్టం జరుగుతుంది. ముందుగానే ఎలాంటి ఇబ్బందులూ ప్రజలకు జరగద్దూ అని స్థానిక ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు  సురేఖ  కార్పొరేషన్ అధికారులతో మాట్లాడి జేసీబీ సహాయంతో పెద్ద కాలువలో కూరుకుపోయిన మట్టిని తీయడం జరిగింది. వెంటనే స్పందించిన  కొక్కిరాల ప్రేమ్ సాగర్ కి సురేఖ కి స్థానికులు ధన్యవాదాలు తెలిపారు.

ఈ కార్యక్రమంలో స్థానిక 7 వార్డు ఇంచార్జీ నరీగే నరేష్, 7 కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు భీమిని రాజేష్, శశి కుమార్ స్థానికులు తదితరులు పాల్గొన్నారు.

IMG-20251226-WA0281
IMG-20251226-WA0281

Poll not found
జిల్లపేల్లి రాజేందర్ ఉమ్మడి అదిలాబాద్ జిల్లా ఇంచార్జ్