కాంగ్రెస్ ప్రభుత్వం చేపట్టిన ఉచిత బస్సు ప్రయాణం పై ఆటో డ్రైవర్లు కార్మికులు యూనియన్ సభ్యులు తీవ్రంగా నిరసన వ్యక్తం చేస్తున్నారు హస్తం పార్టీ మొదటిదెబ్బ ఆటోవాలా పైనే వేసిందని ఎల్లారెడ్డిపేట మండల ఆటో కార్మికులు ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశారు శుక్రవారం రోజున కొత్త బస్టాండ్ వద్ద ఆటో కార్మికులు పెద్ద ఎత్తున నిరసన తెలిపి ధర్నాకు దిగారు అనంతరం డ్రైవర్లు ఆటో యూనియన్లు వారం లోపల మా సమస్యలు పరిష్కరించకపోతే డిపోల ముందు కూర్చొని బైఠాయించి తమ నిరసనను తెలుపుతామన్నారు మా బ్రతుకు సమస్యలు పరిష్కరించాలని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కోరారు ఆటోలో నడుపుతున్న కార్మికులు రోడ్డున పడ్డామని ఆవేదన చెందారు తెలంగాణ వ్యాప్తంగా 15 లక్షల మంది ఆటో డ్రైవర్లు పరోక్షంగా 40 లక్షల మంది కార్మికులు ఉన్నారని గుర్తు చేశారు రేవంత్ రెడ్డి ప్రభుత్వం మా పొట్ట పొట్ట వద్దని కాంగ్రెస్ ప్రభుత్వం వ్యతిరేకించారు మహాలక్ష్మి పథకం ద్వారా బస్సుల్లో ఉచిత ప్రయాణం మహిళలకు ఉండటాన్ని వ్యతిరేకించారు కోల్పోతున్నామని బండి నడిపితేనే బతుకు బండి నడుస్తుందని పేర్కొన్నారు ఆటో డ్రైవర్లకు జీవనభృతి కింద నెలకు 15000 అందించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు కార్యక్రమంలో ఎల్లారెడ్డిపేట మండలం ఆటో యూనియన్ డ్రైవర్లు కార్మికులు తదితరులు పాల్గొన్నారు













