ప్రాంతీయం

బిసిలకి బడ్జెట్ లో మొండిచేయి…

94 Views
  ముస్తాబాద్, ఫిబ్రవరి 12 (24/7న్యూస్ ప్రతినిధి): రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశ పెట్టిన బడ్జెట్ లో బిసిలకు  మొండి చెయ్యి చూపెట్టారు అని కంచర్ల రవిగౌడ్ పేర్కొన్నారు. బిసీలు అంటే సిఎం రేవంత్ రెడ్డికి చులకన భావం వుoదని అందుకే ఈ బడ్జెట్ సమావేశం లో 8 వేల కోట్లు మాత్రమే కేటాయించారని చెప్పారు .రాష్ర్టంలో 60శాతం వున్న  బిసీ లకు బడ్జెట్ లో 3.4 శాతం మాత్రమే కేటాయించడం  బాధాకరం అని చెప్పడం జరిగింది. అప్పటి పి సీ సీ అధ్యక్షులు ఇప్పటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మహాత్మా జ్యోతిభాపులే పేరుతో బిసీ సబ్ ప్లాన్ తీసుకొస్తామని. ప్రతి ఆర్థిక సంవత్సరానికి 20 వేల కోట్లు కేటాయిస్తామని  కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టో లో పేర్కొన్నారని బడ్జెట్ లో మాత్రం మొండి చెయ్యి చూపారని  ప్రవేశ పెట్టిన 8 వేల కోట్ల రూపాయలలో బిసిలకు స్కాలర్షిప్ ఫీజు రీయింబర్స్మెంట్ కి సంక్షేమ పథకాలు కి 3400 కోట్ల బకాయిలు వున్నవని మిగతా కొద్ది నిధులతో బిసీ ల అభివృద్ధి ఎలా చేస్తారని ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి  బిసీ ల పైన వున్న ప్రేమ ఎంటి అని చెప్పకనే తెలుస్తుంది అని ఇప్పటి కి అయిన ఇచ్చిన హామీ మేరకు 20 వేల కోట్లు కి పెంచాలని సీఎం రేవంత్ రెడ్డిని డిమాండ్ చేయడం జరుగుతుందని ఆరోపించారు. ఈ కార్యక్రమంలో  జిల్లా నాయకులు మట్టే శ్రీనివాస్, నవీన్, సిరిసిల్ల పట్టణ అధ్యక్షులు రుద్రవెని సుజిత్  కుమార్, తంగల్లపల్లి మండల అధ్యక్షులు గౌరు రాకేష్, .మరియు నాయకులు నవీన్, శ్రీకాంత్, సిద్దు, ప్రణయ్ నరేష్ తదితరులు పాల్గొన్నారు.
Oplus_131072
Oplus_131072
కస్తూరి వెంకట్ రెడ్డి ఆంధ్రప్రభ ముస్తాబాద్