మంచిర్యాల నుండి ప్రత్యేక రైలులో అయోధ్యకు బయలుదేరిన రామ భక్తులు
బీజేపీ ఆధ్వర్యంలో అయోధ్య దర్శన్ కార్యక్రమంలో భాగంగా మంచిర్యాల రైల్వే స్టేషన్ నుండి మంచిర్యాల జిల్లా లోని 1000 మందికి పైగా రామ భక్తులు మంచిర్యాల రైల్వే స్టేషన్ నుండి ఏర్పాటు చేసిన ప్రత్యేక రైలులో అయోధ్యకు బయలు దేరి వెళ్ళడం జరిగింది. ముందుగా బీజేపీ మంచిర్యాల జిల్లా అధ్యక్షులు రఘునాథ్ వెరబెల్లి ఆధ్వర్యంలో మంచిర్యాల పట్టణం వెంకటేశ్వర టాకీస్ నుండి ముఖరం చౌరస్తా మీదుగా రైల్వే స్టేషన్ వరకు రామ భక్తులతో కలిసి శోభ యాత్ర నిర్వహించడం జరిగింది. అనంతరం బీజేపీ రాష్ట్ర కార్యదర్శి శ్రీ దుగ్యల ప్రదీప్ కుమార్ , మంచిర్యాల బీజేపీ జిల్లా అధ్యక్షులు రఘునాథ్ వెరబెల్లి , పెద్దపల్లి బీజేపీ జిల్లా అధ్యక్షులు చంద్రపట్ల సునీల్ రెడ్డి , రామగుండం బీజేపీ నాయకురాలు కందుల సంధ్య రాణి మరియు పెద్దపల్లి పార్లమెంట్ కన్వీనర్ నగునూరి వెంకటేశ్వర్ గౌడ్ ప్రత్యేక రైలు కు జెండా ఊపి ప్రారంభించడం జరిగింది.
ఈ సందర్బంగా రఘునాథ్ మాట్లాడుతూ వందల ఏండ్ల హిందువుల కళ అయోధ్య రామ మందిర నిర్మాణం ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ కృషి తోనే సాధ్యం అయింది అని అన్నారు. అయోధ్య రమున్ని హిందువులు అందరూ దర్శించుకోవాలి అని ఉద్దేశం తో బీజేపీ ఆధ్వర్యంలో ప్రతి పార్లమెంట్ నుండి ప్రత్యేక రైలు ఏర్పాటు చేసి రామ భక్తులకు రాముని దర్శనం కల్పిస్తున్నామని అన్నారు. ప్రతి 15 రోజులకు ఒక్కసారి రైలు ఏర్పాటు చేయడం జరుగుతుంది అని తెలిపారు. హిందువులు ప్రతి ఒక్కరూ ఆ శ్రీ రాముని దర్శించుకోవాలని కరారు.
