ప్రాంతీయం

జిల్లా పరిషత్ సర్వసభ్య సమావేశం

68 Views

మంచిర్యాల జిల్లా పరిషత్ సమావేశంలో ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు రైతులకు జరుగుతున్న నష్టంపై అధికారులను నిలతీశారు.

శనివారం జిల్లా పరిషత్ చైర్ పర్సన్ నల్లాల భాగ్యలక్ష్మి అధ్యక్షతన జడ్పి సర్వసభ్య సమావేశం జరిగింది. తొలిసారిగా సమావేశంలో పాల్గొన్న ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు అన్నదాత ల తరపున గళం ఎత్తారు. రైతుల నుంచి ధాన్యం కొనుగోలు చేయడానికి కొంత మంది రైస్ మిల్లర్లు విముఖత చూపడాన్ని ఆక్షేపించారు. తరుగు పేరిట రైతులను ముంచగా తాను అభ్యంతరం చెప్పడంతో రైస్ మిల్లర్లు ధాన్యం స్వీకరించడానికి ముందుకు రాకపోవడం సమంజసం కాదని అన్నారు. జిల్లాలో రైస్ మిల్లులు ఎన్ని ఉన్నాయి, వారికి ధాన్యం కేటాయింపు ఎంత జరిగిందో వివరాలు అందజేయాలని అధికారులను ఆదేశించారు. అధికారులు స్పందిస్తూ పూర్తి వివరాలు అందిస్తామని జవాబిచ్చారు.

ఈసమావేశంలో బెల్లంపల్లి, ఖానాపూర్ ఎమ్మెల్యేలు గడ్డం వినోద్, వేడమ బొజ్జు , అదనపు కలెక్టర్ రాహుల్,జిల్లా అటవీ శాఖ అధికారి ఆశీష్ సింగ్ వివిధ శాఖల అధికారులు, జడ్పిటీసీ లు పాల్గొన్నారు.

Oplus_131072
Oplus_131072
జిల్లపేల్లి రాజేందర్ ఉమ్మడి అదిలాబాద్ జిల్లా ఇంచార్జ్