ముస్తాబాద్, ప్రతినిధి అక్టోబర్13, తెలంగాణ తల్లి ఊరి సంస్కృతికి ప్రతిరూపం. ఒంటి నిండా వజ్రవైడుర్యాలు పొదిగిన నగలు, నెత్తిన బంగారు కిరీటాన్ని ధరించి, తెలంగాణకు ప్రతిరూపంగా రాజదర్పాన్ని కలిగి ఉండటం మన స్వరాజ్యం తెలంగాణ సంస్కృతికి నిదర్శనాలు. సకలజన తెలంగాణకు, సబ్బండ వర్గాలజనులకు తల్లిని స్ఫురించే రూపం తెలంగాణతల్లి రాష్ట్రంలో స్థానానికి అర్హురాలవుతుంది …అలాంటి తెలంగాణ తల్లి గద్దెకు టిఆర్ఎస్ కలర్ ఏ విధంగా వేస్తారని ఇతర పార్టీ నాయకులు పలువిధాల ఆరోపణలు చేశారు. అంతేకాకుండా మండలంలో స్థానిక తహసిల్దార్ కార్యాలయంకు వెళ్లి పలు విషయాలు అధికారులకు విన్నవించామని తెలిపారు. శుక్రవారం రోజున ముస్తాబాద్ గ్రామపంచాయతీ అధికారులు సఫాయి కార్మికుల చేత తెలంగాణ తల్లి గద్దెకు నీలి రంగులు వేస్తున్నారు. స్థానికంగా వెళ్లే ప్రజలు గద్దె కలరే మారుస్తారా లేదా తెలంగాణ తల్లి విగ్రహానికి కూడా ఏమైనా రంగులతో మార్పులు చేస్తారా అనే అంశం పైన మాట్లాడుకుంటూ వెళ్లిపోయారు.. తెలంగాణ సాయుధ పోరాటానికి 75 సంవత్సరాలు పూర్తవుతోన్న సందర్భంలో ప్రతి పల్లె, ప్రతి పట్నం, ప్రతి తండా, ఊరువాడ మన వారసత్వ ఘనతను చాటుదాం ఏపార్టీకి సొంతం కాదు మనఅందరి తల్లే తెలంగాణ తల్లి అని తెలిపారు.
