ముస్తాబాద్, ఫిబ్రవరి 6 (24/7న్యూస్ ప్రతినిధి) చెన్నూర్ నియోజకవర్గం మాజి ఎమ్మెల్యే బాల్కసుమన్ అధికారం కోల్పోయి డబ్బు మదంతో మరింత పిచ్చి ముదిరినట్లయిందని ఇసుక మాఫియాతో పాటు మరెన్నో దందాలకు అడ్డు తొలగించుకోలేక పిచ్చి మరింత ఎక్కువై సీఎం రేవంత్ రెడ్డిని అసభ్య పదజాలతో దూషించారని ముస్తాబాద్ రాజీవ్ గాంధీ విగ్రహంనుండి కాలినడకన నినాలతో సంబంధిత ఠాణాకు వెళ్లి మండల అధ్యక్షులు ఆధ్వర్యంలో ఫిర్యాదు చేశారు. మండల అధ్యక్షులు ఏళ్లబాల్ రెడ్డి మాట్లాడుతూ తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పై బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్ చేసిన వ్యాఖ్యలపై ఆయన ఘాటుగా స్పందించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ ముఖ్యమంత్రిపై అనుచిత వ్యాఖ్యలు చేస్తూ ఉంటే తెలంగాణ ప్రజలు నీనాలుక చీరేస్తారని ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడితే మంచిదని తెలియజేస్తున్నామన్నారు. కల్వకుంట్ల బానిస కుక్క వాళ్ల బూట్లునాకు వాళ్ళచెప్పులు మోయి పదేండ్లు అధికారంలో ఉండి తెలంగాణను బంగారు తెలంగాణ అనుకుంటూ అప్పుల కుప్పగామార్చి తాగుబోతుల రాష్ట్రంగా
చేసి అటు యువతను, ఇటు గ్రామీణ వ్యవస్థను పూర్తిగా నిర్వీర్యంచేసి నాశనం చేసిందే కాకుండా, ప్రజాపాలన దిశగా ముఖ్యమంత్రి ఎనమల రేవంత్ రెడ్డి పాలన సాగిస్తూ ఉండగా ఓర్వలేక విచక్షణ కోల్పోయి
చెప్పు చూపించి ఇష్టరాజ్యంగా అడ్డగోలుగా నోటికి ఎంత వస్తే అంత మాట్లాడం అవివేకానికి నిదర్శనం అని మండిపడ్డారు. అదే కోవలో ముస్తాబాద్ జెడ్పిటిసి గుండం నర్సయ్య మాట్లాడుతూ బాల్క సుమన్ నీకు నోటిదూల ఎక్కువైంది నోరు అదుపులో పెట్టుకుంటే అంత మంచిది రాష్ట్ర ముఖ్యమంత్రిని అసభ్య పదజాలతో మాట్లాడుతూ చెప్పులు చూపించడం ఎంతవరకు సమంజసం అని మండిపడ్డారు. ఈ కార్యక్రమంలో ఎంపీ శ్రీనివాస్ గౌడ్, సీనియర్ నాయకులు కొండం రాజిరెడ్డి, ఉచ్చిడి రాజిరెడ్డి, బొందుగుల దేవరెడ్డి, తోట ధర్మేందర్, కొండల్, తలారి నరసయ్య, మామిండ్ల ఆంజనేయులు, కనమేని శ్రీనివాస్ రెడ్డి, గోలకొండ రాజిరెడ్డి, ఆరుట్ల తిరుపతిరెడ్డి కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.
