*రామగుండం పోలీస్ కమీషనరేట్*
*ఎన్నికల విధులకు ఎన్‌సీసీ క్యాడెట్లు*
*క్రమశిక్షణతో విధులు నిర్వహిస్తు అందరితో మర్యాదగా ప్రవర్తించాలి : పోలీస్ కమీషనర్ శ్రీ ఎం. శ్రీనివాస్ ఐపిఎస్.,*
రామగుండం పోలీస్ కమీషనరేట్ పరిధిలో పార్లమెంట్ ఎన్నికల పోలింగ్ రోజు సామాజిక సేవ, స్వచ్ఛంద ప్రాతిపదికన ఎన్‌సిసి క్యాడెట్లను ఎన్నికల విధులకు వినియోగించు కోవడం జరుగుతుంది అని రామగుండం పోలీస్ కమీషనర్ శ్రీ ఎం. శ్రీనివాస్ ఐపిఎస్., (ఐజి) తెలిపారు.
సీపీ ఎన్నికల విధులకు హాజరైన 90 మంది ఎన్‌సిసి క్యాడెట్లకు చేయవలసిన విధులు, చేయకూడని పనుల గురించి వారికీ సూచనలు చేయడం జరిగింది. పోలింగ్ భూతుల లోకి వెళ్ళకూడదు అని, ఓటర్ లను క్యూ పద్ధతి లో ఉండేలా చూడాలని, అక్కడ విధులలో ఉన్న పోలీస్ సిబ్బంది కి సహాయంగా ఉండాలని, క్రమశిక్షణతో ఉంటూ అందరితో మర్యాదగా ప్రవర్తించాలని సూచించారు. ముసలి వాళ్లకు, వికలాంగులు ఎవరైనా ఓటు వేయడానికి వచ్చినప్పుడు బూత్ లోకి వెళ్లే వరకు వారికీ సహాయం అందించాలని తెలిపారు. వీరికి శాంతిభద్రతల పనులు అప్పగించబోమని, కేవలం ఓటరు సహాయం కోసం మాత్రమే వినియోగిస్తామన్నారు
ఈ సమావేశం లో అడిషనల్ డీసీపీ అడ్మిన్ సి. రాజు, స్పెషల్ బ్రాంచ్ ఏసీపీ రాఘవేంద్ర రావు, ఏ ఆర్ ఏసీపీ సురేంద్ర, సిసి అర్బీ ఇన్స్పెక్టర్ బి. స్వామి, ఆర్ఐ కె.మధు పాల్గొన్నారు.
