ప్రాంతీయం

రామ కీర్తనలతో మార్మోగిన శివారు వెంకటాపూర్ గ్రామం

169 Views

రామ కీర్తనలతో మార్మోగిన శివారు వెంకటాపూర్ గ్రామం

హనుమాన్ దేవాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించిన హనుమాన్ మాల ధారణ స్వాములు

సిద్దిపేట్ జిల్లా మే 28

గజ్వేల్ నియోజకవర్గo మర్కుక్  మండల్ శివారు వెంకటాపూర్ మాల ధారణ స్వాముల ఆధ్వర్యంలో హనుమాన్ దేవాలయాన్ని బంతిపూల తోరణాలతో అలంకరించి హనుమాన్ దేవాలయంలో చందనం,పాలాభిషేకం, గణపతి పూజ, నవగ్రహాల పూజ, కలశారాధన యజ్ఞం పూజలు అత్యంత వైభవంగా నిర్వహించారు. శివార్ వెంకటాపూర్ గ్రామ ప్రజలు సుఖ సంతోషాలతో ఆయురారోగ్యాలతో ఉండాలని హనుమాన్ స్వాములు కార్తీక పంతులు,పురోహితులు వేద పండితుల మధ్య హోమము నిర్వహించారు.వేద పండితులు హోమం అనంతరం గ్రామ ప్రజలు ఆయురారోగ్యాలతో ఉండాలని ఆశీర్వదించారు. తదనంతరం అన్న ప్రసాద కార్యక్రమం నిర్వహించి భక్తిని చాటుకున్నారు.

ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి గ్రామ గురు స్వాములు మాట్లాడుతూ అష్ట ఐశ్వర్యాలతో గ్రామ,మండల ప్రజలు సుభిక్షంగా ఉండాలని హోమయజ్ఞం నిర్వహించామని అన్నారు.గ్రామ ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొని ఈ హోమం కార్యక్రమాన్ని విజయవంతం చేసినందుకు గ్రామ ప్రజలకు హనుమాన్ స్వాములు కృతజ్ఞతలు తెలిపారు.

ఈ కార్యక్రమంలో ఎంపిటిసి తుమ్మల లక్ష్మి నర్సమ్మ టిఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు తుమ్మల కనకయ్య, మాజీ సర్పంచ్ పుట్ట మంజుల నర్సింలు ,పుట్ట బాల్ నర్సయ్య బచ్చల జహంగీర్, కిషన్ గౌడ్, పుట్ట కిష్టయ్య, బచ్చల సతీష్, పుట్ట జహంగీర్, పుట్ట శ్రీధర్, పుట్ట కిష్టయ్య, దర్శనాల అనిల్, హనుమాన్ స్వాములు నాయకులు మహిళలు గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు.

IMG-20251226-WA0281
IMG-20251226-WA0281

రాచర్ల గొల్లపల్లి లో సర్పంచ్ గా గెలిచేది ఎవరు...?
ములుగు విజయ్ కుమార్ తెలంగాణ రాష్ట్ర ఇంచార్జ్