రోలింగ్లో గందరగోళం.. క్రమశిక్షణ తో ఉందాలనిపొన్నం కార్యకర్తలకు సర్దుబాటు చేశారని కాంగ్రెస్ జిల్లా కార్యదర్శి వంగ గిరిధర్ రెడ్డి మీడియా తో తెలిపారు. అనవసరంగా మంత్రి పొన్నం ప్రభాకర్ గౌడ్ వీడియోలు కొంతమంది విపక్ష కార్యకర్తలు వక్రీకరించి సోషల్ మీడియాలో వైరల్ చేస్తున్నారని మండపడ్డారు .మంత్రి పొన్నంపై వీడియో వైరల్ చేయడం సబబు కాదని జిల్లాలో అధికారులతో సమీక్ష సమావేశంలో పాల్గొనడానికి వచ్చిన మంత్రి పొన్నం ప్రభాకర్ గౌడ్ కాంగ్రెస్ కార్యకర్తలను పలకరించి శుభాకాంక్షలు తెలిపేందుకు పెద్దఎత్తున కార్యకర్తలు నాయకులు స్టేజ్ పైకి రావడంతో వారిని కిందికి వెళ్ళమని చెప్పగా వినకపోవడంతో మంత్రి స్వయంగా తన కాంగ్రెస్ పార్టీ బలగాన్ని కిందకు దించే క్రమంలో కొంత తోపులాట జరిగిన విషయం వాస్తవం అన్నారు బీఆర్ఎస్ నాయకులు పనికట్టుకొని పొన్నం ప్రభాకర్ గౌడ్ వీడియోను గోరంతను కొండంతలుగా వైరల్ చేయడం సరి అయింది కాదని కాంగ్రెస్ పార్టీ జిల్లా కార్యదర్శి వంగ గిరిధర్ రెడ్డి గురువారం మీడియాతో అన్నారు. వైరల్ చేసే వీడియోను పూర్తిగా ఖండిస్తున్నట్లు చెప్పారు. పిచ్చిగా ప్రవర్తిస్తున్నాడని సామాజిక మాధ్యమాల్లో రాస్తే పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేస్తామని హెచ్చరించారు.
