ఎల్లారెడ్డిపేట ఫిబ్రవరి 1,సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలం దుమాల గ్రామంలోని రామిండ్లవాడలో నూతనంగా నిర్మిస్తున్న సిఎస్ఐ చర్చిని గురువారం ఎన్నారై డాక్టర్ పాకలపాటి సూర్య ప్రకాష్ – ప్రియాంక లు సందర్శించారు, ఈ సందర్భంగా సూర్య ప్రకాష్ మాట్లాడుతూ తాము పెరిగిన ఊరికి ఏదో ఒక సేవ చేయాలనే ఉద్దేశంతో త్వరలోనే తప్పకుండా తాము పెరిగిన ఊరికి ఏదో ఒక సేవ రూపకంగా రుణం తీర్చుకుంటామని తెలియజేశారు, సిఎస్ఐ చర్చిని సందర్శించడానికి వచ్చిన సూర్య ప్రకాష్ దంపతులకు గ్రామస్తులు శాలువాతో ఘనంగా సన్మానించారు, ఈ కార్యక్రమంలో పాస్టర్ మణిరత్నం, చర్చి అధ్యక్షులు కురుకుంట్ల దావీద్, కుల సంఘం అధ్యక్షుడు జార్జ్, సంఘ పెద్దలు .క్రైస్తవులు రత్నమ్మ , గుంటి సూర్యారావు, స్వామి, పౌలు, దేవదానం, రామిండ్ల కుమార్, రామిండ్ల పద్మారావు తదితరులు పాల్గొన్నారు,
